ఫ్యామిలీ కోసం కోడలి ప్రమోషన్స్

Update: 2017-11-29 16:31 GMT
టాలీవుడ్ కొత్త జంట అక్కినేని నాగ చైతన్య - సమంత పెళ్లి వేడుకలన్ని ముగిసిన తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. ముఖ్యంగా సమంత అయితే గ్యాప్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటోంది. తన పెళ్లి వల్ల సినిమాల షూటింగ్స్ వాయిదా పడటంతో నిర్మాతలను నొప్పించకుండా డే అండ్ నైట్ కష్టపడుతోంది. అంతే కాకుండా మధ్య మధ్యలో కొన్ని ప్రయివేట్ కార్యక్రమాల్లో కూడా కనిపిస్తోంది. నాగ చైతన్య మాత్రం సవ్యాసాచి సినిమాను కూల్ గా చేసుకుంటూ వెళుతున్నాడు.

ఇక సతీమణి లెట్ గా వస్తే అప్పుడప్పుడు ముందే వంట చేసి రెడీగా ఉంచుతున్నాడట. అయితే అసలు మ్యాటర్ లోకి వస్తే సమంత ఈ మధ్య ఇతర సినిమాలకు కూడా ప్రమోషన్స్ బాగా చేస్తోంది. ముఖ్యంగా తన ఫ్యామిలీ కి సంబందించిన ప్రతి ఒక్క సినిమా వేడుకల్లో సమంత ఉండాలని కుటుంబ సభ్యులు కూడా ఫిక్స్ అయిపోయారు. సమంత ఇమేజ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి అలాంటి హీరోయిన్ బంధువైతే కాస్త సినిమా ప్రమోషన్స్ కోసం సహాయం కోరడంలో తప్పు లేదు. అయినా సమంత కూడా చాలా హ్యాపీగా తన వంతు సహాయాన్ని చేయడానికి కృషి చేస్తోంది.

ప్రస్తుతం అఖిల్ సినిమా హలో ప్రమోషన్స్ గురించి మమయ్యతో చర్చలు బాగానే జరుపుతుందట. మరిదికి ఎలాగైనా విజయం అందించాలని ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారట సమంత. అయితే అలాగే నాగార్జున మేనల్లుడు సుమంత్ సినిమాకు కూడా సమంత ప్రమోషన్ చేయడానికి సిద్ధమవుతోంది. సుమంత్ చాలా రోజుల తర్వాత ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గౌతమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మళ్లీ రావా అనే ఆ సినిమా డిసెంబర్ 8న రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. అయితే ఆ సినిమా ట్రైలర్ ను సమంత నాగ చైతన్య రేపు ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అంతే కాకుండా సమంత సోషల్ మీడియాలో ఈ సినిమా ప్రమోషన్స్ చేయడానికి డిసైడ్ అయ్యారట. మరి కొత్త కోడలి ప్రమోషన్ వల్ల సుమంత్ ఏ స్థాయిలో హిట్ అందుకుంటాడో  చూడాలి.
Tags:    

Similar News