తిరుమ‌లేశా ఇక నువ్వే దిక్కు

Update: 2019-04-02 04:12 GMT
సినిమాల రిలీజ్ ల‌కు ముందు తిరుమ‌లేశుని ద‌ర్శించుకోవ‌డం అన్న‌ది ఓ సెంటిమెంట్. ఏడుకొండ‌ల సామి ఆశీర్వ‌దిస్తే బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ల‌కు ఢోకా ఉండ‌ద‌ని మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు న‌మ్ముతుంటారు. ఈ సెంటిమెంట్ ఆర్టిస్టుల్లోనూ ఉంది. ప్ర‌తిసారీ త‌మ సినిమా రిలీజ్ వేళ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశుని ద‌ర్శ‌నం చేసుకునేందుకు స్టార్లు కూడా వెళుతుంటారు. అస‌లు తిరుప‌తి సెంటిమెంట్ కి ఆద్యుడు ఎవ‌రు? అంటే..

మూవీ మొఘ‌ల్ డా.డి.రామానాయుడు ఆచ‌రించిన‌ సంప్ర‌దాయం ఇది. ఎంద‌రో స్టార్ ప్రొడ్యూస‌ర్లు వెంక‌టేశుని స‌న్నిధానంలో మొక్కులు తీర్చుకుని వ‌స్తుంటారు. దిల్ రాజు - నాగార్జున‌ - సురేష్ బాబు - తిరుప‌తి ప్ర‌సాద్ - బివిఎస్.ఎన్ ప్ర‌సాద్ - బెల్లంకొండ సురేష్ వంటి టాప్ రేంజ్ నిర్మాత‌ల‌కు ఈ అల‌వాటు నిత్య‌కృత్యం. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి అల్లు అర‌వింద్ త‌దిత‌రులు వెంక‌టేశునికి మెగా భ‌క్తులు. సెంటిమెంటుగా సామి వారి దివ్య‌ద‌ర్శ‌నం చేసుకుని వ‌స్తుంటారు. మెగాభిమానులు అయితే చిరు సినిమాల రిలీజ్ ల వేళ సెంటిమెంటును ఫాలో చేస్తుంటారు.

తాజాగా అదే బాట‌లో స‌మంత తిరుమ‌లేశుని ద‌ర్శ‌నం చేసుకోవ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. స‌మంత‌- నాగ‌చైత‌న్య పెళ్లి త‌ర్వాత న‌టించిన తొలి సినిమా `మ‌జిలీ`. ఈ సినిమా సెంటిమెంటుగానూ బంప‌ర్ హిట్ కావాల‌ని అక్కినేని కాంపౌండ్ భావిస్తోంది. టీజ‌ర్ - ట్రైల‌ర్ స‌హా పాట‌ల‌కు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. శివ నిర్వాణ ఈ చిత్రాన్ని ఆద్యంతం ఎమోష‌న‌ల్ గా తీర్చిదిద్దార‌ని ట్రైల‌ర్ చెబుతోంది.  భ‌ర్త త‌ప్పుల్ని కాచి.. అత‌డి ఉన్న‌తికి కృషి చేసే మంచి భార్య‌గా స‌మంత ఈ చిత్రంలో న‌టించారు. ఇప్పుడు భ‌ర్త విజ‌యం కోస‌మే తిరుమ‌లేశుని ద‌ర్శ‌నం చేసుకున్నారు. కాలిన‌డ‌క దారిలో మెట్లు ఎక్కి మ‌రీ సామ్ ఒక సాధార‌ణ ప‌డ‌తిలా ఎంతో శ్ర‌మించారు. ఎంక‌న్న సామి ఈ సెంటిమెంటుకు అయినా క‌నిక‌రించ‌క‌పోతాడా? అంటూ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. వెంక‌టేశుని ద‌ర్శ‌నానికి వెళ్లిన స‌మంత ఎంతో డీసెంట్ గా సాధాసీధాగా సామాన్య భ‌క్తురాలిగా అక్క‌డ జ‌నంలో క‌లిసిపోయి క‌నిపించ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. మొత్తానికి సామ్ సెంటిమెంట్ ప్ర‌కారం మొక్కు తీరింది. ఇక మ‌జిలీ బాక్సాఫీస్ విజ‌యానికి ఎంక‌న్న సామే దిక్కు అన్న‌మాట‌!!

Tags:    

Similar News