ట్రైలర్ టాక్: ఆసక్తిని కలిగిస్తున్న 'బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి'...!
తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' ఇతర ఓటీటీలతో పోటీ పడే ప్రయత్నంలో కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ''బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి'' అనే సినిమాని రిలీజ్ చేయనున్నారు. టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ మూవీ టీజర్ ఇటీవలే విడుదలై విశేష స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో లేటెస్టుగా 'బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి' ట్రైలర్ విడుదల చేశారు. అక్కినేని నాగ చైతన్య సతీమణి సమంత ట్రైలర్ ని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేస్తూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని ట్వీట్ చేసింది.
కాగా 1994లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. 'ప్రతి కథ మనిషి పుట్టుకతో మొదలవుతుంది.. కానీ నా కథ నా చావుతో మొదలైంది' అనే డైలాగ్ తో ఈ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. రొమాంటిక్ సోషల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే ప్రేమ, పగ, పరువు నేపథ్యంలో 'Rx 100' మూవీ ఛాయలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. రామ్ కె మహేషన్ సినిమాటోగ్రఫీ.. మిహిరాంశ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి.
'బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి' చిత్రానికి పోలూరి కృష్ణ దర్శకత్వం వహించారు. శ్రీ సాయి పవర్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై పమిడిముక్కల చంద్రకుమారి ఈ చిత్రాన్ని నిర్మించారు. మున్నా - దృశిక చందర్ హీరోహీరోయిన్లుగా నటించగా రవి వర్మ, సుబ్బారావు, పవిత్రా జయరామ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ నెల 21వ తేదీన ఆహా ఓటీటీ యాప్ లో ఈ చిత్రం విడుదల కానుంది.
Full View