షకీలా.. ఇండియాలో ఇంతకంటే పాపులర్ లేడీ నేమ్ మరొకటి ఉండదేమో. ఈ పేరు వింటే చాలు ఒకప్పుడు కుర్రాళ్లు షేక్ అయిపోయేవాళ్లు. శృంగార తారగా షకీలాకు ఏ స్థాయిలో గుర్తింపు వచ్చిందంటే.. ఇండియాలో ఇంకెవరూ కూడా తమ పిల్లలకు ఈ పేరు పెట్టుకునే సాహసం చేయలేకపోయారు. అప్పటికే ఈ పేరు పెట్టుకున్న వాళ్లు సిగ్గుతో చచ్చిపోయి.. పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి. ఈ స్థాయిలో ‘పేరు’ తెచ్చుకున్న పేరు.. షకీలా. ఈ పేరు ఏ రకంగానూ వాడుకలో లేని పరిస్థితుల్లో ఓ స్టార్ హీరోయిన్ ఆ పేరుతో ఓ క్యారెక్టర్ చేస్తుండటం షాకిచ్చే విషయమే.
ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు.. సమంత రూత్ ప్రభు. విక్రమ్ సరసన సమంత నటిస్తున్న కొత్త సినిమా ‘10 ఎన్రదుకుల్లా’లో ఆమె పేరు షకీలానే కావడం విశేషం. దర్శకుడు ఏ ఉద్దేశంతో హీరోయిన్ క్యారెక్టరుకు ఆ పేరు పెట్టాడో కానీ.. సమంత ఏ ఇబ్బందీ లేకుండా ఆ పేరుతో క్యారెక్టర్ చేయడాడానికి ఒప్పేసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోందీ సినిమా. ఇంతకుముందు ‘గోలీసోడా’ సినిమాకు దర్శకత్వం వహించిన సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ మిల్టన్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ‘ఐ’ తర్వాత విక్రమ్ నటిస్తున్న సినిమా ఇదే. ఐతే తెలుగులోనూ విక్రమ్, సమంతలకు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ తమిళంతో పాటు ఒకేసారి ఈ సినిమాను విడుదల చేయట్లేదు. తెలుగులో వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.