చెర్రీని బావ అని పిలవనుందట

Update: 2017-10-08 07:39 GMT
సినిమాల్లోకి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా సౌత్ బ్యూటీ సమంత మాత్రం తన స్టార్ హోదాను ఒక లెవెల్ లో మెయింటెన్ చేస్తూ వస్తోంది.. జయాపజయాలతో సంబంధం లేకుండా తనదైన శైలిలో సినిమాలను చేస్తోంది. రీసెంట్ గా అక్కినేని కోడలు అనే హోదా పొందిన విషయం తెలిసిందే. అయతే చాలా మంది హీరోయిన్స్ పెళ్లి తర్వాత దాదాపు సినిమాలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా సినీ తారలను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ అయితే అటువైపు కూడా చూడరు.

కానీ  సమంత నాగ చైతన్య ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తనకు ఇష్టమైన సినిమా ఫీల్డ్ ని ఏ మాత్రం వదలనని ఇదివరకే చాలా సార్లు చెప్పింది. అక్కినేని వారు అడ్డు చెప్పలేదు. అయితే సమంత రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న రంగస్థలం 1985 లో హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో సమంత చరణ్ ని బావ అని పిలవబోతోందట. అంటే ఆమె హీరోకి మరదలు పాత్రన్నమాట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం పూర్తి కావొచ్చింది. ప్రస్తుతం దర్శకుడు కొన్ని విలేజ్ సెట్స్ లలో ముఖ్యమైన సీన్స్ ని తెరకెక్కిస్తున్నాడు.

అప్పుడప్పుడు చిరంజీవి కూడా ఆ సెట్స్ కి వెళుతున్నారు. ఇక సమంత తన మామతో రాజుగారి గది 2 లో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుంది. ఈ నెల 13న ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా నాగ్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
Tags:    

Similar News