మహానటి సావిత్రిపై సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ స్క్రిప్ట్ పై చాలాకాలం పని చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్.. ఇప్పుడు సినిమాను తెరకెక్కించేందుకు సిద్దమైపోతున్నాడు. మహానటిగా లీడ్ రోల్ ను కీర్తి సురేష్ చేయబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. ఈ మూవీలో సమంత కీలక పాత్ర చేయబోతోందట.
సావిత్రి ఆటోబయోగ్రఫీ రాసే జర్నలిస్ట్ పాత్రలో సమంత నటించనుందని తెలుస్తోంది. నిజానికి సమంతకు సావిత్రిగా లీడ్ రోల్ లో నటించే అవకాశం లభించినా.. ఆ పాత్ర కోసం బరువు పెరిగి లావుగా మారాల్సిన అవసరం ఉండడంతో.. ఛాన్స్ వదులుకుందట శామ్స్. కానీ ఈ స్క్రిప్ట్ గురించి పూర్తిగా తెలిసిన సమంత.. ఈ ప్రాజెక్టులో భాగం కావాలనే ఉద్దేశ్యంతో.. తనకు జర్నలిస్ట్ అవకాశం ఇస్తే చేస్తానని మేకర్స్ కు చెప్పిందట. దీంతో వెంటనే ఈ ఆఫర్ ను అమ్మడికి ఇచ్చేశారు. మహానటి మూవీలో సమంత చేయనున్న పాత్ర కీలకంగా ఉంటుందని అంటున్నారు.
ఇలాంటి బయోపిక్ లో భాగం అవుతున్నందుకు సంతోషంగా వెలిబుచ్చుతోంది సమంత. చాలాకాలంగా తెలుగు సినిమా యాక్సెప్ట్ చేయని ఈ బ్యూటీ.. మహానటిలో భాగం కావడం విశేషం. ఫిబ్రవరి నుంచి ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుండగా.. తెలుగు.. తమిళ్.. హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/