సమంత, సెటైర్‌ టైపులో ఉందమ్మా!!

Update: 2015-09-13 09:30 GMT
చెన్నై సోయంగం స‌మంత ప్రేమ‌లో అనుభ‌వ పాఠాల్ని వ‌ల్లించింది. అలా మాట్లాడేప్పుడు ఎంతో ఉద్వేగాన్ని క‌న‌బ‌రిచింది. ఆ ఉద్వేగంలో ఎదుటివాళ్లు ఏం వింటున్నారో అనేది కూడా గ్ర‌హించ‌కుండా.. ఓ మాట అనేసింది. అస‌లు ప్రేమ‌ల‌కు సైజులు - షేపులు ముఖ్య‌మా? అయితే ఇదంతా బెంగుళూరు డేస్‌ సినిమాలో రానా - సమంత ల గురించే సమంత చెప్పిందని అందరూ అనుకుంటున్నా.. అందులో పంచ్‌ మాత్రం సిద్ధార్థ్ కోసం డిజైన్‌ చేసిందా అనే సందేహాలు వస్తున్నాయ్‌.

సమంత‌ను ఎప్పుడు క‌దిలించినా సినిమా విశేషాలు చెబుతుంది త‌ప్ప వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి ముచ్చ‌టించిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ. పొర‌ట‌పాటున అడిగినా త‌ప్పించుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక ఇద్ద‌రు మ‌నుషులు అర్ధం చేసుకోవ‌డానికి అంద‌మైన మ‌న‌సు ఉండాలి త‌ప్ప అందం కాదు. ముఖ్యంగా మనుషుల సైజులు - షేపులు  కాద‌ని రాసుకొచ్చింది. స్వ‌చ్ఛ‌మైన  ప్రేమ‌కు అందంతో ప‌నిలేద‌ని అమ్మ‌డు చెబుతోంది. కొంపతీసి తన నిజ జీవితంలోని ఏదైనా ఎపిసోడ్‌ కు కనెక్టు చేసి ఇలా చెప్పిందా లేకపోతే ఇదంతా సినిమాలో భాగమేనా? ఎందుకంటే సినిమాలో ఆమె చేస్తున్న క్యారెక్టర్‌ తాలూకు డిజైన్‌ వేరు - ఈ మాటలు తాలూకు పంచ్‌ వేరు. ఒరిజినల్‌ మలయాళం సినిమా చూసినోళ్ళకి అది అర్ధమవుతోంది.

ఏదేమైనా ప్ర‌స్తుతం సిద్దూ - సమంత ఒక‌రికొక‌రు సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటున్నారు. ఇద్దరు కూడా త‌మిళ్ సినిమాల‌తోనే బిజీగా ఉండ‌టం విశేషం. కాకపోతే సమంత సెటైర్‌ వేస్తే సిద్దూ అంత తేలికగా వదిలేస్తాడా.. మనోడు కూడా మాటల్లో ఓ రేంజు ఎక్స్ పెర్ట్  కదండీ!!!
Tags:    

Similar News