టాలీవుడ్ బ్యూటీ సమంత.. పబ్లిక్ ఫంక్షన్స్ లో కనిపించి చాలాకాలమే అయింది. గత నెలలో రాజు గారి గది2 ప్రమోషన్స్ లో పాల్గొంది కానీ.. అవి ప్రెస్ మీట్స్ మాత్రమే. కానీ పబ్లిక్ ముందుకు.. ముఖ్యంగా అభిమానుల ముందుకు సామ్ వచ్చి చాలా కాలమే అయింది. పెళ్లి పనుల్లో బిజీ.. ఆ తర్వాత పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. ఇలా తెగ బిజీగా ఉంది సమంత
ఇప్పుడు నారా రోహిత్ నటించిన బాలకృష్ణుడు మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా.. జనాల ముందుకు వచ్చిన సమంత.. అభిమానులను తెగ ఖుషీ చేసేసింది. తన స్టైల్ లో తెలుగులో మాటలు మొదలుపెట్టిన సమంత.. తనకు మైక్ ఇచ్చిన వ్యక్తిని.. ఇక నీ పని అయిపోయింది వెళ్లిపో అంటూ.. తను నవ్వేసి అందరినీ నవ్వించేసింది. 'నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఈ మూవీ నిర్మాత మహేంద్ర గారు నా ఫ్యామిలీలోని ఒక వ్యక్తిగా మెలిగారు. దర్శకుడు పవన్ నాకు ఐదేళ్ల నుంచి తెలుసు. ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటేనే నాకు ఎంతో ఆసక్తి కలిగింది. బాలకృష్ణుడు ట్రైలర్ చూస్తుంటేనే.. ఇది పెద్ద హిట్ అవుతుందని అనిపించింది. నారో రోహిత్.. రెజీనా.. చాలా బాగున్నారు. మణిశర్మ గారు అందించిన సంగీతం సూపర్బ్ గా ఉంది' అని చెప్పింది సమంత.
సామ్ కేవలం ఒక్క నిమిషం పాటే ఈ ఫంక్షన్ లో మాట్లాడినా.. ఈ వేడుకకే సమంత స్పెషల్ అట్రాక్షన్ అయిపోయింది. అసలు అభిమాన అందాల బ్యూటీ.. మళ్లీ సినిమాల్లో కనిపిస్తుందని తెలిసినా.. ఇలా పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొంటే.. ఫ్యాన్స్ కు ఆ సందడే వేరు.