పీకపై కత్తితో కొట్టేసిన సమంత

Update: 2018-01-04 04:28 GMT
అక్కినేని కోడలు సమంత పెళ్లి తరువాత కూడా చాలా బిజీ బిజీగా సినిమాలను చేస్తోంది. అయితే అప్పటిలాగా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేస్తోంది. ముఖ్యంగా ప్రయోగాత్మకమైన కథలకు ఎక్కువగా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. రీసెంట్ గా అలాంటి కథనే ఒకటి ఈ అమ్మడు ఒకే చేసింది. అందులో ఆమె పాత్రకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేసి చిత్ర యూనిట్ పెద్ద షాక్ ఇచ్చింది. ఎందుకంటే టీజర్ లో సమంత పీక కట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ప్రస్తుతం ఆ టీజర్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఒకతను మత్తులో ఉండగా సమంత మాంసం కట్ చేసే ఒక పదునైన కత్తిని పట్టుకొని గొంతు పై పెట్టి కట్ చేయాలని చూసింది. ఫైనల్ గా కొట్టేసింది కానీ అప్పటికే టైటిల్ పడింది. అదే ''సూపర్ డీలక్స్'' సినిమా. కోలీవుడ్ లో థియాగరాజన్ కుమారరాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆ సినిమాలో సమంత ఈ తరహా పాత్రలో కనిపించనుందని టీజర్ ద్వారా చెప్పేశారు.

ఇక సినిమాలో సమంతతో పాటు విజయ్ సేతుపతి - ఫహాధ్ ఫసిల్ అలాగే రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరి సమంత చేసే పాత్ర పూర్తిగా ఎలా ఉంటుందో తెలియాలంటే సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది. మరి సినిమా ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి.

Full View
Tags:    

Similar News