మన సినిమాల్లో స్టార్ హీరోల ఎంట్రీ.. హీరోయిన్ల ఎంట్రీ ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటుంది. చిరు.. బాలయ్యల పాత సినిమాల్లో హీరో ఎంట్రీ ఎప్పుడూ షూతో స్టార్ట్ అయ్యేది. మొదట బూట్లను చూపించడం.. స్లో గా దాన్ని ఫేస్ వరకూ చూపించడం.. అదోరకం హీరోయిజం. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే పూలు.. అందమైన లొకేషన్.. తర్వాత నవ్వుతూ ఉండే హీరోయిన్ ను చూపించేవారు. ఇప్పుడు ఈ ట్రెండ్స్ లో చాలా మార్పులు వచ్చాయి. అయితే మిగతా స్టార్ హీరోయిన్ల సంగతేమో కానీ సమంతా నటించే సినిమాలలో సామ్ ఎంట్రీ సీన్ హాట్ టాపిక్ అవుతోంది.
స్వీటీ హబ్బీ నాగచైతన్యతో కలిసి నటించిన 'మజిలీ' లో సమంతా ఫస్ట్ హాఫ్ అంతా ఉండదు. జస్ట్ ఇంటర్వెల్ ఎపిసోడ్ లో ఎంట్రీ ఇస్తుంది. వాన పడుతూ ఉంటే కాటన్ శారీ ధరించి గొడుగు పట్టుకొని వస్తూ ఎంట్రీ ఇస్తుంది. గొడుగును మెల్లగా పైకెత్తి ఇన్నోసెంట్ ఫేస్ తో చూడడం.. దానికి తగ్గట్టుగా సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. జనాలను మాయ చేసేసింది. 'మజిలీ' లో ఉన్న బెస్ట్ షాట్స్ లో అదొకటి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ సీన్ వచ్చినప్పుడు థియేటర్ లో రెస్పాన్స్ పీక్స్ లో ఉంది.
ఇప్పుడు మరోసారి 'ఓ బేబీ' లో అలాంటి ఫీట్ రిపీట్ అయింది. ఈ సినిమాలో కూడా సమంతా లేట్ గానే ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడ కూడా రెయిన్ ఎఫెక్ట్.. పరిగెడుతూ వచ్చి ఎరుపు రంగు గొడుగును తన మొహానికి అడ్డుగా పెట్టుకుంటుంది. యాజ్ యూజువల్... నేపథ్యం సంగీతం సరిగ్గా కుదిరింది. దీంతో సామ్ ఎంట్రీ సీన్లో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. సహజంగా స్టార్ హీరోల ఎంట్రీ సమయంలో మాత్రమే.. థియేటర్ల లో సందడి ఉంటుంది. కానీ సామ్ ఎంట్రీని కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. స్లో గా సామ్ టాలీవుడ్ క్వీన్ గా మారుతుందేమో.