108 సార్లు సూర్య నమస్కారాల‌తో సామ్ బ‌స్తీ మే స‌వాల్‌

Update: 2020-09-12 16:30 GMT
ఫిట్ నెస్ ఫ్రీక్ స‌మంత ఈ స్వీయ‌నిర్భంధ స‌మ‌యాన్ని అన్నిర‌కాలుగా స‌ద్వినియోగం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. గ‌చ్చిబౌళి ఇంటి రూఫ్ టాప్ పై కూర‌గాయ‌లు పండించి స‌ర్ ప్రైజ్ చేసిన స‌మంత‌.. ఇంట్లో వంటా వార్పుతోనూ బిజీ అయిపోయింది. మ‌రోవైపు భ‌ర్త నాగ‌చైత‌న్య‌కు సేవ‌లందిస్తూ నిరంత‌రం ఆద‌ర్శ‌వంత‌మైన భార్యామ‌ణిగా ఫోక‌స్ అవుతోంది. త‌న‌తో క‌లిసి సినిమాల‌కు ప్లాన్ చేస్తూనే త‌న‌కంటూ స‌ప‌రేట్ కెరీర్ ప్లానింగుతో సామ్ ఎంత బిజీగా ఉందో తెలిసిందే.

ఇక ఇంత బిజీ లైఫ్ ని ఒత్తిళ్ల మ‌యం కాకుండా కాపాడుకునేందుకు సామ్ చాలానే మెయింటెయిన్ చేస్తోంది. యోగా జిమ్ ధ్యానం అంటూ దానికోసం ప్ర‌త్యేకించి స‌మ‌యాన్ని కేటాయిస్తోంది. ఈ లాక్ ‌డౌన్‌ కాలంలో భర్త నాగచైతన్యతో కలిసి యోగా చేస్తున్న ఫోటోల్ని ఇంత‌కుముందు షేర్ చేసింది. ఈ వీకెండ్ ను సరికొత్త ఫీట్ తో వ్వావ్ అనిపించే ట్రీట్ నే ఇచ్చింది.

ఈసారి ఏకంగా 108 సార్లు సూర్య నమస్కారాలు చేసి వావ్‌ అనిపించింది సామ్. అందుకు సంబంధించిన ఫోటోల్ని అంత‌ర్జాలంలో అభిమానుల‌కు షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ పోటో వైర‌ల్ గా మారింది. లాక్ డౌన్ ముగిశాక ద‌స‌రా కానుక‌గా సామ్ న‌టించిన ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2 అభిమానుల‌కు ట్రీటివ్వ‌నుంది. అమెజాన్ ప్రైమ్ లో దీనిని స్ట్రీమింగ్ చేయ‌నున్నారు.
Tags:    

Similar News