సమంత మళ్ళీ వచ్చేస్తోందోచ్‌!!

Update: 2015-12-08 15:30 GMT
ఇప్పటివరకు ఈ ఏడాది కేవలం ఒకేఒక్కసారి సమంతను ఆమె తెలుగు అభిమానులు వెండితెరపై చూశారు. ఈ సంవత్సరంలో కేవలం సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాలో తప్పిస్తే.. అసలు సమంత టాలీవుడ్‌ లో పెద్దగా కనిపించిందే లేదు. ఎందుకంటే అమ్మడు మాతృబాష సాంబార్‌ ల్యాండ్‌ లో బ్యాక్‌ టు బ్యాక్‌ 5 సినిమాలు ఒప్పుకుంది.

విక్రమ్‌ తో 10 ఎన్నాదుకుళ - ధనుష్‌ తో తంగమగన్‌ - విజయ్‌ తో కొత్త సినిమా - సూర్య తో 24 - అలాగే మరోసారి ధనుష్‌ తో మరో సినిమా ఒప్పేసుకుంది సమంత. వీటిల్లో విక్రమ్‌ సినిమా ఒక్కటే షూటింగ్‌ పూర్తి చేసుకొని రిలీజ్‌ అవ్వగా.. ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌. ఆ సినిమా తెలుగువర్షన్‌ తో దసరా పండుగనాడు తెలుగువారిని కూడా పలకరిస్తుందని అనుకుంటే.. తమిళంలో అట్టర్‌ ఫ్లాప్‌ అవుతుందని తెలిసిన నిర్మాతలు.. తెలుగులో ఎందుకులే ప్రింట్‌ అండ్‌ పబ్లిసిటీ కాస్టులు కూడా రావని అనుకుని అస్సలు రిలీజ్‌ చేయలేదు. అయితే ఇప్పుడు సమంత మరో తమిళ సినిమాతో తెలుగు వారికి సంవత్సారంతంలో ఒక ట్రీట్‌ ఇవ్వనుంది.

ధనుష్‌ హీరోగా సమంత, ఏమీ జాక్సన్‌ కథానాయకులుగా రూపొందిన 'తంగమగన్‌' సినిమాను తెలుగులో ''నవ మన్మథుడు'' అంటూ రిలీజ్‌ చేస్తున్నారు. టైటిల్‌ ధనుష్‌ కు పెద్దగా యాప్ట్ గా లేకపోయినప్పటికీ.. సమంత పాపులార్టీతో ఈ సినిమాను భారీగా రిలీజ్‌ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో మన అమ్మడు పెద్దగా గ్లామరసం ఏమీ కురిపించలేదు. కేవలం పెర్ఫామెన్స్ చూపించిందంతే.


Tags:    

Similar News