ఇదంతా సాధించానంటున్న సమంత

Update: 2015-08-25 17:49 GMT
సౌతిండియాలో మోస్ట్ కమాండ్, డిమాండ్ ఉన్న హీరోయిన్ సమంత. ఒకసారి ఈ అమ్మడితో జట్టు కడితే... మళ్లీ మళ్లీ ఈ భామనే తమ సినిమాల్లో ఛాన్సులిస్తున్నారు డైరెక్టర్లు, హీరోలు. తన అఛీవ్ మెంట్ అదే అంటోంది సమంత. ప్రస్తుతం కెరీర్ లోనే పీక్ స్టేజ్ లో ఉన్న సమంత... ఇప్పుడు 7-8చిత్రాలకు సంతకాలు చేసేసింది.

దాదాపు ట్యాలెంటెడ్ డైరెక్టర్లు, యాక్టర్లు  అందరినీ చుట్టేసింది ఇప్పటికే.  ఇండస్ట్రీ గర్వించదగ్గ డైరెక్టర్లుగా గుర్తింపు పొందిన వారు కూడా... సమంతకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నారు. మొదటి సినిమా పూర్తయ్యే ముందే... తమ మరుసటి చిత్రానినికి కూడా సైన్ చేయాలని అడుగుతున్నారని.. అదే తన సక్సెస్ కు నిదర్శనమని అంటోందీ భామ. టాలీవుడ్ లోనే మహేష్ తో రెండు సార్లు, నాగ చైతన్య తో నాలుగు సార్లు  జత కట్టగా.... ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ లో నటిస్తూ.. రెండోసారి పవన్ తో సందడి చేయబోతోదందని టాక్

ఇక త్రివిక్రమ్... ఇప్పటికే త్రివిక్రమ్ తో  రెండు సినిమాలు చేయగా... మాటల మాంత్రికుడు తీయబోతున్న ఫిమేల్ డామినేటెడ్ స్టోరీలోనూ కనిపించనుంది. అంతేమరి.. ట్యాలెంట్,. అందం కలిసుండి, కాలం కలిసొస్తే... ఇలాగే ఉంటుంది పరిస్థితి.
Tags:    

Similar News