విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ కి సారీ చెప్పేసింది!

Update: 2023-02-01 14:03 GMT
భారీ అంచ‌నాలు పెట్టుకున్న 'లైగ‌ర్‌' దారుణంగా డిజాస్ట‌ర్ కావ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ కొంత అసంతృప్తికి గురైన విష‌యం తెలిసిందే. మూడేళ్లు శ్రమించి ఒళ్లు హూనం చేసుకుని చేతులకు గాయాలైనా లెక్క‌చేయ‌కుండా చేసిన సినిమా ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోగా కెరీర్ డిజాస్ట‌ర్ గా నిల‌వ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ, ఆయ‌న అభిమానులు తీవ్ర నిరాశ‌కు లోన‌య్యారు. దీని నుంచి వెంట‌నే బ‌య‌ట‌ప‌డాల‌ని ఈ మూవీ త‌రువాత 'ఖుషీ' మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాడు.

శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. గ‌త కొన్ని నెల‌లుగా ఈ మూవీ త‌దుప‌రి షెడ్యూల్ స‌మంత కార‌ణంగా నిలిచిపోయింది. మ‌యో సైటీస్ కార‌ణంగా స‌మంత గ‌త కొన్ని నెల‌లుగా తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే. స‌మంత పూర్తి గా కోలుకోవాల‌ని, త‌న ఆరోగ్యం కుదుట ప‌డిన త‌రువాతే 'ఖుషీ' తాజా షెడ్యూల్ ని మొద‌లు పెట్టాల‌ని ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌, హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ ముగ్గురికి షాకిస్తూ స‌మంత 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' మేక‌ర్స్ రాజ్ అండ్ డీకె ద‌ర్శ‌క‌ద్వయం రూపొందిస్తున్న 'సీటాడెల్‌' వెబ్ సిరీస్ కోసం స‌మంత ముంబై వెళ్లింద‌నే వార్త లీక్ అయింది. ఇదే విష‌యంపై క్లారిటీ ఇస్తూ అమెజాన్ ప్రైమ్ వీడియో సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. సమంత సీటాడెల్ టీమ్ తో ముంబైలో వుంద‌ని వెల్ల‌డించి షాకిచ్చింది. ఈ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటున్న స‌మంత మ‌రో రెండు మూడు వారాల పాటు అక్క‌డే వుండ‌నుంద‌ని తెలిసింది.

ఈ విష‌యం తెలిసిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ సామ్ పై ఫైర్ అవుతున్నార‌ట‌. అప్పుడెప్పుడో మొద‌లైన మ‌ధ్య‌లో త‌న కోసం ఆగిపోయిన 'ఖుషీ'ని ప‌క్క‌న పెట్టి కొత్త‌గా మొద‌లైన 'సీటాడెల్‌' కోసం సామ్ వెళ్ల‌డం అభిమానులని తీవ్ర అసంతృప్తికి గురిచేసింద‌ట‌. దీంతో విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన నేర‌మేంట‌ని సోస‌ల్ మీడియా వేదిక‌గా సామ్ పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నార‌ట‌. ఇది గ‌మ‌నించిన స‌మంత వెంట‌నే దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది.

సోష‌ల్ మీడియా వేదిక‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమానుల‌తో పాటు ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ వారికి క్ష‌మాప‌లు చెబుతూ ట్వీట్ చేసింది. 'ఖుషీ' మూవీ షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌ల‌వుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.

సామ్ ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా స్పందించాడు. 'ఏమంతా పూర్తి స్తాయిలో కోలుకుని న‌వ్వుతున్న ముఖంతో తిరిగి రావాల‌ని కోరుకున్నాం' అంటూ పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం సామ్‌, విజ‌య్ ల ట్వీట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News