చై సామ్ ఎవరు విన్నర్?

Update: 2018-09-14 04:28 GMT
నిన్న వినాయక చవితి పండగ సందర్భంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేసిన క్యూట్ కపుల్ నాగ చైతన్య సమంతా సినిమాల్లో ఏది విజేతగా నిలుస్తుంది అనే దాని గురించి ముందు నుంచే చాలా ఆసక్తి నెలకొంది. మొత్తానికి రెండు విజయవంతంగా బరిలో దిగటం వాటి మీదున్న హైప్ కు తగ్గట్టు విడివిడిగా మంచి ఓపెనింగ్స్ సాధించడం ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తింది. కానీ రెండూ ఒకే స్థాయి స్పందన దక్కించుకున్నాయి అనేలా మాత్రం పరిస్థితి లేకపోవడం గమనార్హం. నిజానికి రిలీజ్ కు ముందు రోజు వరకు శైలజా రెడ్డి అల్లుడునే అన్ని రకాలుగా పైచేయిగా ఉంది. థియేటర్ల సంఖ్య మొదలుకుని చూడాలనుకున్న ప్రేక్షకుల కౌంట్ దాకా చైతు డామినేషన్ స్పష్టంగా కనిపించింది. కానీ ఓ రెండు షోలు పూర్తవ్వగానే పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. శైలాజారెడ్డి అల్లుడు పూర్తి స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయిందనే కామెంట్స్ వినిపిస్తుండగా యుటర్న్ తను టార్గెట్ చేసిన ఆడియన్స్ తో పాస్ మార్కులు వేయించుకోవడమే కాదు క్రిటిక్స్ తో సైతం మెప్పు పొందింది.

ఇక్కడ యుటర్న్ కాస్త మెరుగ్గా కనిపించడం విశేషం. డివైడ్ టాక్ ఉన్నప్పటికీ శైలజా రెడ్డి అల్లుడు ఫస్ట్ డే ఓపెనింగ్స్ విషయంలో చైతు గత సినిమాల రికార్డ్స్ దాటేసిందని ట్రేడ్ ప్రాధమిక సమాచారం. లెక్కలు ఇంకా రావాల్సి ఉంది. ఇండియాతో సహా ఓవర్సీస్ లో సైతం మంచి వసూళ్లే నమోదయ్యాయి. వీటిని అల్లుడు ఎంత వరకు నిలబెట్టుకుంటాడు అనే దాన్ని బట్టి శైలజారెడ్డి అల్లుడు ఫైనల్ స్టేటస్ ఆధారపడి ఉంది. ఇక యుటర్న్ విషయానికి వస్తే కేవలం సమంతా మీద భారం వేసిన ఈ మూవీ ఆశ్చర్యకరంగా హైదరాబాద్ లో ఉన్న దేవి 70 ఎంఎం లాంటి పెద్ద థియేటర్ లో సైతం మూడు షోలు హౌస్ ఫుల్ చేయించింది అంటే చిన్న విషయం కాదు. అందులోనూ నిన్న సెకండ్ షో పూర్తిగా సోల్డ్ అవుట్ అయిపోవడం పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. మాస్ సినిమా ఆందులోనూ చాలా ఆకర్షణలు ఉన్న శైలజా రెడ్డి అల్లుడు ఫుల్ కావడంలో ఆశ్చర్యం లేదు కానీ స్టార్లు లేకుండా యుటర్న్ లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ఇలా రెస్పాన్స్ తెచ్చుకోవడం అంటే సమంతా ప్లస్ దర్శకుడు పవన్ ఘనతే. ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఇలా ఉంది కానీ ఈ వీక్ ఎండ్ పూర్తయ్యాక విజేత ఎవరనే విషయం స్పష్టంగా తేలుతుంది. వారాంతం కాబట్టి ఈ మూడు రోజులు ఢోకా ఉండకపోవచ్చు కానీ అసలైన పరీక్ష సోమవారం నుంచి మొదలవుతుంది.
Tags:    

Similar News