అఖిరా ఎంట్రీపై చరణ్ హింట్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ NBK షోలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.

Update: 2025-01-07 11:28 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ NBK షోలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ట్రైలర్ ఇప్పటికే విడుదలై అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. రామ్ చరణ్ తన వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను బాలకృష్ణతో పంచుకున్నారు. ప్రత్యేకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరా నందన్ సినీ రంగ ప్రవేశంపై చరణ్ కొన్ని కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఎపిసోడ్‌లో రామ్ చరణ్, అఖిరా నందన్ గురించి ప్రత్యేకమైన విషయాలను వెల్లడించారని తెలుస్తోంది. అఖిరా త్వరలోనే వెండితెరపై సందడి చేసే అవకాశం ఉందని హింట్ ఇచ్చారని ఇండస్ట్రీలో బలమైన టాక్ వినిపిస్తోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవన్ కళ్యాణ్ సినిమా OGలో కూడా అఖిరా స్పెషల్ కేమియోలో కనిపించే అవకాశం ఉందని రామ్ చరణ్ హింట్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఓజీ` సినిమాలో అకీరా కనిపిస్తాడట అని బాలకృష్ణ అడిగిన ప్రశ్నకి స్పందించారు. ఏమో ఓజీలో కనిపించినా ఆశ్చర్యం లేదు అనేలా హింట్‌ ఇచ్చాడని ప్రోమో ద్వారా అర్ధమవుతుంది. ఇంతకుముందు అకిరా OG లో కనిపించనున్నట్లు ఒక టాక్ వచ్చింది. ఇక చరణ్ కూడా ఆ వార్తలపై ఇన్ డైరెక్ట్ గా స్పందించారని తెలుస్తోంది. అఖిరా నందన్ తొలి సినిమా ఎంట్రీపై పవన్ అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల అఖిరా తల్లి రేణు దేశాయ్ కూడా తాను అఖిరా తదుపరి అడుగు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పిన సంగతి తెలిసిందే.

అఖిరా ప్రస్తుతం మ్యూజిక్‌ నేర్చుకుంటున్నప్పటికి, నటనలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అఖిరా తాజాగా రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఈవెంట్‌కు రామ్ చరణ్‌తో కలిసి వచ్చాడని టాక్, అలాగే అన్నతోనే తిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో అఖిరాను చూసిన ఫ్యాన్స్, ఆయన ఆరంగేట్రంపై మరింత ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే అన్‌స్టాపబుల్ విత్ NBK షోలో రామ్ చరణ్ పాల్గొన్న పూర్తి ఎపిసోడ్ జనవరి 8 ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌లో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి రానుండటంతో అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య, చరణ్ మధ్య జరిగిన సరదా సంభాషణలు, చరణ్ సినిమాలపై బాలయ్య వ్యాఖ్యలు, అన్నింటికంటే అఖిరా నందన్ ఎంట్రీ హింట్ ఈ ఎపిసోడ్‌కు హైలైట్ కానున్నాయని సమాచారం.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అఖిరా నందన్ వెండితెర ఎంట్రీ ఒక ఫెస్టివల్‌ లాంటిదే. రామ్ చరణ్ చేసిన ఈ చిన్న హింట్‌తోనే అఖిరా తొలిప్రయాణంపై ఆసక్తి మరింతగా పెరిగింది. OGలో అఖిరా ఎంట్రీ నిజమైతే, ఆయన తన తండ్రి పవన్ కళ్యాణ్ వారసత్వాన్ని అందుకుంటూ మరో యంగ్ ఐకాన్‌గా ఎదిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరి అది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

Tags:    

Similar News