కొత్త రకం పబ్లిసిటీ టర్న్!

Update: 2018-09-03 06:13 GMT
ఈ నెల 13న భర్త సినిమా శైలజారెడ్డి అల్లుడుతో పోటీకు సై అంటున్న సమంతా యు టర్న్ ప్రేక్షకుల దృష్టిని మెల్లగా తనవైపుకు తిప్పుకుంటోంది. థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ మూవీ చూడడానికి వంద కారణాలు చెప్పమంటే అందులో తొంభై సమంతా పేరే చెబుతాయి. కాకపోతే ఇది రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం కాదు కాబట్టి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం అంత తేలిక కాదు. అందుకే మేకర్స్ కొత్త తరహా ప్రమోషన్ కు తెరతీశారు. ప్రమోషనల్ సాంగ్ పేరుతో యు టర్న్ టీమ్ విడుదల చేసిన ఓ వీడియో సాంగ్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. అజ్ఞాతవాసి దెబ్బకు మళ్ళి కనిపించకుండా పోయిన అనిరుద్ రవిచందర్ ట్యూన్ కంపోజ్ చేయడమే కాదు అందులో తాను కూడా నటించేసాడు. సమంతా స్టెప్స్ వేస్తూ ఉండగా సదా నువ్వే కదా ప్రతి క్షణాన అంటూ సాగిపోయే ఈ పాట సామ్ మూమెంట్స్  కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ పాటకు కథకు ఏ మాత్రం లింక్ లేకపోవడమే విశేషం.

దీనికి కారణం పబ్లిసిటీ పరంగా కొంత వెనుకబడినట్టు కనిపిస్తున్న యు టర్న్ ఆడియన్స్ అటెన్షన్ ని తనవైపుకు తీసుకోవడమే అని చెప్పొచ్చు. డిఫెరెంట్ గా అనిపించే కలర్ స్కీమ్స్ మధ్య వేసిన సెట్స్ లో సమంతా డాన్స్ చేయటం బాగానే ఉంది కానీ ఇది సినిమాలో ఉండటం అయితే అనుమానమే. ఒక ఫ్లై ఓవర్ మీద విడగొట్టిన డివైడర్ వల్ల జరిగే యాక్సిడెంట్స్ మిస్టరీని చేధించే జర్నలిస్ట్ పాత్రలో సమంతా ఇందులో కొత్త తరహా పాత్ర చేస్తోంది.హీరో కానీ డ్యూయెట్స్ కానీ ఏమి ఉండవు. తనకు సహాయ పడే పోలీస్ పాత్రలో ఆది పినిశెట్టి కనిపిస్తాడు అంతే. అందుకే మసాలా మిస్ అవుతున్న కారణంగా సమంతా అభిమానుల కోసం ఈ వీడియోని తీసినట్టు కనిపిస్తోంది. ది న్యూ డాన్స్ యాంతం పేరుతో శ్రీ సాయి కిరణ్ రాసిన ఈ పాటకు యు టర్న్ దర్శకుడు పవన్ కాకుండా కృష్ణ మారిముత్తు షూట్ చేయటం విశేషం. మొత్తానికి పబ్లిసిటీకి పది వేల పాట్లు తరహాలో యుటర్న్ కోసం సమంతా బాగానే కష్టపడుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    

Similar News