ఆ బట్టలు స్వాహానా సమంత??

Update: 2017-06-02 10:47 GMT
టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం థాయ్ ల్యాండ్.. బ్యాంకాక్ లకు వెకేషన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. వెళ్లక ముందే ఇక్కడ నుంచి లాంగ్ టూర్ సంగతి చెప్పిన సామ్.. అక్కడికి వెళ్లిన తర్వాత అభిమానులను మరిచిపోకుండా బోలెడన్ని ఫోటోలను చూపెడుతోంది. రకరకాల గెటప్స్ లో కనిపిస్తూ కనువిందు చేసేస్తోంది.

సమంత బ్యాంకాక్ డ్రెస్ లలో ఒకటి మాత్రం తెగ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే.. ఈ గెటప్ లో ఈ భామ రీసెంట్ గా కనిపించింది. కొన్ని రోజుల క్రితం బికినీ టాప్ వేసుకుని షూట్ చేసింది గుర్తుందా? అదేనండీ హ్యాండ్ లూమ్స్ లో కూడా లేటెస్ట్ ట్రెండ్ ఉంటుందంటూ.. బికినీ టాప్ లో అందాలు ఆరబోసిందే.. ఆ బట్టలతో ఇప్పుడు సామ్ బ్యూటీ బ్యాంకాక్ లో హాలిడే ఎంజాయ్ చేస్తోంది. అంటే తనకోసం షూట్ కు తెచ్చిన డ్రెస్ ను.. ఇలా బ్యాంకాక్ లో వేసుకుంటోంది. అంటే ఫోటో షూట్ కోసం ఇచ్చిన కాస్ట్యూమ్స్ ను ఎంచక్కా స్వాహా చేసేసిందన్నమాట.

అయితే.. ఇందులో ఇండియన్ హ్యాండ్ లూమ్స్ కి ఇంటర్నేషనల్ పబ్లిసిటీ అనే యాంగిల్ కూడా ఉందనే సంగతి మరిచిపోకూడదు. అయినా ఓ విషయంలో సమంతను పొగడాల్సిందే. సహజంగా ఈ రేంజ్ భామలు ఎవరూ వేసిన డ్రెస్ ను మరోసారి వేసి పబ్లిక్ లో కనిపించేందుకు సిద్ధపడరు. కానీ సమంత మాత్రం అలాంటి భేషజాలేమీ పెట్టుకోవడం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News