వీడియో : సమంత హాట్‌ వర్కౌట్‌ వైరల్‌

Update: 2020-11-10 09:10 GMT
హీరోయిన్స్‌ ఫిట్‌ గా ఉండేందుకు ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్‌ హీరోయిన్స్‌ గా కంటిన్యూ అవ్వాలంటే వరుసగా ఆఫర్లు దక్కించుకోవాలి. అలా వరుస ఆఫర్ల కోసం ఫిట్‌ గా ఉండటం తప్పనిసరి. అందుకే హీరోయిన్స్‌ దాదాపు అంతా కూడా ప్రతి రోజు గంటల తరబడి జిమ్‌ లో వర్కౌట్స్‌ చేస్తూ ఉంటారు. సమంత కూడా చాలా కష్టపడి వర్కౌట్స్‌ చేస్తూ ఉంటుంది. ఆమె ఫిజిక్‌ కోసం ఎంతగా కష్టపడుతుంది అనే విషయం గతంలో షేర్‌ చేసిన ఫొటోలు మరియు వీడియోలు చెప్పకనే చెబుతున్నాయి. ఇటీవల సమంత చేసిన వర్కౌట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ వీడియోలో సమంత పడుతున్న కష్టం కనిపిస్తుంది. సాదారణంగా ఇలాంటి వర్కౌట్స్‌ చేయాలంటూ చాలా స్టామినా ఉండాలి. ఒక్క చేయిపై బాడీని బ్యాలన్స్‌ చేస్తూ మూమెంట్స్‌ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. సమంత చాలా ప్రాక్టీస్‌ చేయడం వల్లే ఈజీగా ఈ వర్కౌట్‌ చేసింది. ఇక ఈ వీడియోలో ఆమెను మరో యాంగిల్‌ లో కూడా అభిమానులు చూస్తున్నారు.

కష్టపడి వర్కౌట్లు చేస్తున్న సమంత ఇదే సమయంలో సమంత హాట్‌ గా కూడా కనిపిస్తూ నెటిజన్స్‌ ను ఆకర్షిస్తోంది. సమంత ఈమద్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా కనిపించకున్నా వివిధ మార్గాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటుంది. ఫ్యామిలీ మెన్‌ 2 వెబ్‌ సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమంత త్వరలో ఆహా లో టాక్‌ షో అలరించబోతుంది. ఇవే కాకుండా తన సొంత వ్యాపారంను కూడా సమంత మొదలు పెట్టింది.
Tags:    

Similar News