గబ్బర్ సింగ్ సీక్వెల్ అనగానే అందరికీ సంపత్ నంది గుర్తుకొస్తాడు. ఈ సినిమాకు ముందు డైరెక్టరుగా ఎంపికైంది సంపత్ నందే అని.. అతను రెండేళ్ల పాటు పవన్ కళ్యాణ్ తో కలిసి ట్రావెల్ చేశాడని అందరికీ తెలుసు. కానీ సంపత్ అంత టైం స్పెండ్ చేశాక అతణ్ని పవన్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పించేయడం అప్పట్లో సంచలనమైంది. ఐతే తన కెరీర్ ని పవన్ అంత దెబ్బ తీసినా ఎప్పుడూ దాని గురించి ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు సంపత్. సైలెంటుగా రవితేజతో ‘బెంగాల్ టైగర్’ ఓకే చేయించుకున్నాడు. సినిమా పూర్తి చేసి మంచి హైప్ మధ్య రిలీజయ్యేలా చూసుకుంటున్నాడు.
ఐతే ఈ మధ్యే ఒకసారి మాట వరసకు పవన్ తో సినిమా చేసి తీరుతా అని విలేకరులతో చెప్పిన సంపత్.. పవన్ వల్ల తన కెరీర్ కు జరిగిన నష్టం గురించి పరోక్షంగా ఓ వ్యాఖ్య చేశాడు. ‘బెంగాల్ టైగర్’ ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్ అస్తవ్యస్తంగా తయారైన పరిస్థితుల్లో రవితేజ నాకు లైఫ్ ఇచ్చి ఆదుకున్నారు. ’’ అన్నాడు సంపత్. ఇక్కడ గబ్బర్ సింగ్-2 ప్రస్తావన తేలేదు కానీ.. ఆ ప్రాజెక్టు నుంచి పవన్ తప్పించడం ద్వారా తన కెరీర్ అస్తవ్యస్తంగా తయారైందని మాత్రం చెప్పకనే చెప్పేశాడు. ఆ సంగతలా వదిలేస్తే ‘బెంగాల్ టైగర్’ బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా అవుతుందని కాన్ఫిడెంటుగా చెబుతున్నాడు సంపత్. అన్ని వర్గాల ప్రేక్షకులకూ ఈ సినిమా నచ్చుతుందని సంపత్ అన్నాడు.