తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ వేడి పెరిగిపోతోంది. ఇప్పటికే 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోతున్నాయి. ఈ ప్రభావం హీరో సంపూర్ణేష్ బాబుపై కూడా పడింది.
ప్రస్తుతం సంపూ పశ్చిమ గోదావరి జిల్లాలో షూటింగ్ చేస్తున్నారు. పాలకొల్లు సమీపంలో నర్సాపూర్ ప్రాంతంలో ఉన్నాడీ హీరో. యూనిట్ తో పాటు షూటింగ్ చేస్తున్న సమయంలో.. ఒక్కసారిగా సంపూకి వాంతులు చేసుకుని పడిపోయాయి. వడ దెబ్బ కొట్టడంతో ఇలా జరిగిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. సంపూ షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో టెంపరేచర్ 44 డిగ్రీలు నమోదు కావడంతో.. పరిస్థితి తీవ్రమయిందని తెలుస్తోంది. అయితే.. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇప్పుడు పరిస్థితి నార్మల్ గానే ఉందని డాక్టర్లు, యూనిట్ వర్గాలు చెబుతున్నారు.
సంపూర్ణేష్ బాబుకు సీరియస్ అవడంతో పాటు.. ఆ ఏరియాలో షూటింగ్ ఇప్పుడు చాలా కష్టం అనే పరిస్థితి అర్ధం కావడంతో.. సినిమా యూనిట్ తిరిగి హైద్రాబాద్ వచ్చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్ ను తర్వాత షెడ్యూల్ చేసుకుంటామని చెబుతున్నారు. ప్రస్తుతం సంపూర్ణేష్ బాబును బెడ్ రెస్ట్ తీసుకోవాల్సింది డాక్టర్లు సూచించారు.