లవ్‌ అఫైర్‌..డిప్రెషన్‌ లోకి వెళ్లిన హీరోయిన్‌

Update: 2020-02-12 23:30 GMT
తెలుగులో పలు చిత్రాల్లో నటించిన సనా ఖాన్‌ హీరోయిన్‌ గా ఆశించిన స్థాయిలో గుర్తింపును దక్కించుకోలేక పోయింది. టాలీవుడ్‌ లో ఈ అమ్మడికి ఆఫర్లు కరువవ్వడంతో బాలీవుడ్‌ లో ప్రయత్నించింది. అక్కడ కూడా ఈ అమ్మడికి నిరాశే మిగిలింది. అవకాశాలు లేని సమయంలో కొరియోగ్రాఫర్‌ మెల్విన్‌ లూయిస్‌ తో పరిచయం అయ్యి అతడి ప్రేమలో పడిపోయింది. అతడిపై గతంలో పలు సందర్బాల్లో పలు ఇంటర్వ్యూలో ప్రశంసల వర్షం కురిపించి తామిద్దరం మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అన్నట్లుగా మాట్లాడటం జరిగింది.

కాని ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఈ అమ్మడిని గురుడు మోసం చేశాడట. తాజాగా మీడియా ముందుకు వచ్చిన సనా అతడి గురించి షాకింగ్‌ విషయాలను బయట పెట్టింది. మెల్విన్‌ కు పలువురు అమ్మాయిలతో అఫైర్స్‌ ఉన్నాయని.. ఆ విషయం నేను ప్రత్యక్షంగా చూశానంటూ వాపోయింది. అతడు నన్ను దారుణంగా మోసం చేశాడు. అతడి మోసంకు నేను డిప్రెషన్‌ లోకి వెళ్లి పోయాను. అతడి కారణంగా నేను జీవితంలో చాలా నష్టపోయానంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

నేను అతడిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. కాని అతడు మాత్రం నన్ను ఈజీగా మోసం చేశాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నట్లుగా చెబుతూనే ఇతర అమ్మాయిలతో బెడ్‌ రిలేషన్‌ ను కలిగి ఉన్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడిప్పుడే అతడి మోసం నుండి తేరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News