రవితేజ 'డాన్ శీను'గా నటించాడు. ఆ సినిమాలో డాన్ శీను అమితాబ్‌కి పెద్ద ఫ్యాన్. అభిమాని కాబట్టి అందులో బిగ్‌బి విజువల్స్‌ని సందర్భానుసారం వాడుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో మెగాస్టార్ చిరంజీవి విజువల్స్‌ని టైగర్ సినిమాలో ఉపయోగించారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్ ఓ ఆర్ఫాన్. పైగా మెగాస్టార్ అభిమాని. అందుకే టైటిల్ సాంగ్‌లో మెగాస్టార్ హిట్ సినిమాల్లోని పాపులర్ డైలాగుల్ని, విజువల్స్‌ని ఉపయోగించామని, అవి చిరుకి సిసలైన ట్రైబ్యూట్ అని చెబుతున్నాడు సందీప్.
చిరంజీవికి స్వతహాగానే వీరాభిమానిని.. కాబట్టి ఇలా మెగాస్టార్ విజువల్స్‌ని నా సినిమాలో చూపించడాన్ని ట్రైబ్యూట్‌గా ఫీలవుతున్నా అని అంటున్నాడు. సూపర్‌స్టార్ రజనీకాంత్, బిగ్‌బి అమితాబ్ విజువల్స్‌ని తమిళ్, హిందీ సినిమాల్లో ఇదే తరహాలో చూపించి అభిమానం ప్రదర్శించడం చూస్తూనే ఉన్నాం. అదే తరహా లో నాక్కూడా ఓ ఛాన్స్ దక్కింది. కథానుసారమే మెగా విజువల్స్‌ని సినిమాలో చూపిస్తున్నాం.. అని సందీప్ చెప్పాడు.
'టైగర్' స్నేహం నేపథ్యంలోని సినిమా ఇది. సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ స్నేహితులుగా నటించారు. ఓ అనాధ తనకి తానుగా టైగర్ అని పేరు పెట్టుకుంటాడు. ఆ టైగర్ స్నేహం కోసం ఏం చేశాడన్నదే సినిమా. ఈ నెల 26న సినిమా రిలీజవుతోంది. ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.