తన సినిమాకు పోటీగా ఇంకో సినిమా వస్తోందంటే.. అది ఫ్లాప్ అవ్వాలని, తన సినిమానే బాగా ఆడాలని కోరుకుంటారు చాలా మంది హీరోలు. లోపల ఎలా ఉన్నా కనీసం పైకి కూడా ఆ పోటీగా వస్తున్న సినిమా గురించి మంచి మాటలు మాట్లాడ్డానికి ఇష్టపడరు. ఐతే సందీప్ కిషన్ మాత్రం తన సినిమా విడుదలయ్యే రోజు పోటీలో ఉన్న మిగతా రెండు సినిమాల గురించి పాజిటివ్‌గా మాట్లాడాడు. ఆ రెండు సినిమాలు కూడా హిట్టవ్వాలని కోరుకుంటూ ఆ సినిమాల హీరోలకు బెస్ట్ విషెస్ చెప్పి తన ప్రత్యేకత చాటుకున్నాడు సందీప్. ''నాగశౌర్య సినిమా జాదూగాడు అతడికి మంచి సక్సెస్ ఇవ్వాలి. వేర్ ఈజ్ విద్యాబాలన్ హీరో ప్రిన్స్‌కు కూడా నా బెస్ట్ విషెస్. నా 'టైగర్'తో పాటు ఆ రెండు సినిమాలు కూడా బాగా ఆడాలి'' అని ట్వీట్ చేశాడు సందీప్.
ఇప్పటిదాకా సాఫ్ట్ క్యారెక్టర్లే వేసిన సందీప్ ఈసారి 'టైగర్'గా మాస్ హీరో అవతారమెత్తాడు. ఐతే మాస్ సినిమా చేస్తున్నాను కాబట్టి వీరలెవెల్లో హీరోయిజం ఏమీ చూపించలేదని.. ఈ సీన్‌లో హీరో కొడితే బాగుణ్నే అని ప్రేక్షకుడు ఫీలైనపుడు మాత్రమే ఫైట్ ఉంటుందని.. తన ఇమేజ్‌కు మరీ దూరంగా నేల విడిచి సాము చేయలేదని చెప్పాడు సందీప్. ముందుగా అనుకున్న స్క్రిప్టు ప్రకారమైతే సినిమా మధ్యలో తన హీరో ఎంట్రీ ఉంటుందని.. ఐతే తర్వాత 21వ నిమిషంలో తన ఎంట్రీ ఉండేలా స్క్రిప్టు మార్చామని చెప్పాడు సందీప్. తన కెరీర్లో 'టైగర్' బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా చెప్పాడీ యువ కథానాయకుడు.