మనోడు బాలీవుడ్‌ మీడియాను ఏకి పారేశాడు

Update: 2019-06-04 01:30 GMT
తెలుగులో అర్జున్‌ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించి ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. తెలుగులో మునుపెన్నడు లేని విధంగా బోల్డ్‌ కంటెంట్‌ తో - లెక్కకు మించిన ముద్దు సీన్స్‌ తో అర్జున్‌ రెడ్డిని తెరకెక్కించి యూత్‌ ఆడియన్స్‌ కు పిచెక్కించాడు. సినిమా విడుదల సమయంలో.. విడుదలైన తర్వాత రకరకాలుగా ప్రచారం జరిగినా కూడా విమర్శలు వచ్చినా కూడా వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని సినిమా విడుదల చేసి సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్నాడు. అద్బుతమైన అర్జున్‌ రెడ్డిని ప్రస్తుతం ఈయన బాలీవుడ్‌ లో 'కబీర్‌ సింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే పనిలో ఉన్నాడు.

'కబీర్‌ సింగ్‌' చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది. ఇటీవల విడుదలైన పోస్టర్స్‌ మరియు టీజర్‌ ఇతరత్ర ప్రమోషన్‌ వీడియోలతో ఈ చిత్రంపై అక్కడ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఈ చిత్రం మహిళా సాధికారతను దెబ్బ తీసే విధంగా ఉందంటూ విమర్శలు చేస్తుంటే మరి కొందరు మాత్రం ఈ చిత్రంలో ఆడవారిని తక్కువ చేసి చూపించారంటూ విమర్శలు చేస్తున్నారు. దర్శకుడిపై కూడా పెద్ద ఎత్తన కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. సందీప్‌ రెడ్డిని అక్కడ మీడియా వారు పెద్దగా పట్టించుకోవడం లేదనిపిస్తోంది.

తాజాగా సినిమా గురించి మీడియాలో వస్తున్న వార్తలపై సందీప్‌ రెడ్డి సీరియస్‌ అయ్యాడు. సినిమాను చూడకుండానే ఇందులో ఆ సీన్స్‌ ఉంటాయి.. ఇది ఆ తరహా సినిమా అంటూ విమర్శలు చేసే వారిని నేను పట్టించుకోను. నేను హీరోయిన్‌ అందాలను చూపించి సినిమాను అమ్ముకోవాలనుకునే రకం కాదు. సినిమాలో నేను హీరోయిన్‌ ను వల్గర్‌ గా చూపించను. కథకు అవసరం అయినంత వరకు మాత్రమే నేను రొమాంటిక్‌ సీన్స్‌ చేస్తాను. అంతకు మించి చేయను అంటూ చెప్పుకొచ్చాడు.

పబ్లిసిటీ కోసం ప్రాకులాడుతూ చూడని సినిమా గురించి కామెంట్స్‌ చేస్తూ ఉండే ఫెమినిస్టులను తాను పెద్దగా పట్టించుకోను అంటూ బాలీవుడ్‌ మీడియాకు షాక్‌ ఇచ్చాడు. ఒక సౌత్‌ దర్శకుడు బాలీవుడ్‌ మీడియాపై ఈ స్థాయిలో సీరియస్‌ అవ్వడం బాలీవుడ్‌ దర్శకులకు సైతం ఆశ్చర్యంగా అనిపిస్తుందట. సందీప్‌ రెడ్డి వంగ బాలీవుడ్‌ మీడియాకు మరియు విమర్శకులకు ఇచ్చిన కౌంటర్‌ తో ఇకపై అయినా ఈ చిత్రంపై విమర్శలు చేయడం ఆపుతారేమో చూడాలి.

Tags:    

Similar News