శివ తర్వాత మళ్ళీ ఇదేనా

Update: 2019-06-22 01:30 GMT
నాగార్జున కెరీర్ లో ఎప్పటికి గుర్తుండిపోయే ల్యాండ్ మార్క్ మూవీగా శివ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ డెబ్యూ మూవీ అయినప్పటికీ తెలుగు సినిమా గమనాన్ని మార్చిన వండర్ గా ఇప్పటికీ దాని గురించి ఎక్కడో ఒక చోట విశ్లేషకులు ప్రస్తావిస్తూనే ఉంటారు. దాని హిందీ రీమేక్ కూడా వర్మనే తీశాడు. ఏ సీన్ ని వాడుకోకుండా ప్రతిది కొత్త ఆర్టిస్టులతో యధాతధంగా తీసి అక్కడా హిట్టు కొట్టాడు. హీరో హీరొయిన్ విలన్ ఇంకో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన అందరూ వేరే క్యాస్టింగ్ ఉంటుంది. తెలుగు రేంజ్ లో కాకపోయినా బాలీవుడ్ లోనూ శివ ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.

ఇప్పుడు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ కు వస్తున్న రిపోర్ట్స్ చూస్తుంటే అదే మేజిక్ ఇంకో తెలుగు దర్శకుడు చేసినట్టుగా కనిపిస్తోంది. కబీర్ సింగ్ గ్రాండ్ గా ఓపెన్ అయ్యాడు. క్రిటిక్స్ కూడా మంచి రేటింగ్స్ తో పాటు షాహిద్ కపూర్ నటనను సందీప్ వంగా టేకింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. కొంత డివైడ్ ఒపీనియన్స్ వినిపిస్తున్నప్పటికీ ఫైనల్ గా హిట్ అవ్వడం ఖాయమని ట్రేడ్ నుంచి వస్తున్న రిపోర్ట్.

అక్కడి యూత్ కి సైతం ఇది కనెక్ట్ అయినట్టుగా చెబుతున్నారు. ఈ లెక్కన రెండు బాషలలో ఒకే సినిమాను తీసి హిట్టు కొట్టిన తెలుగు దర్శకుల్లో వర్మ తర్వాత సందీప్ రెడ్డి వంగానే నిలుస్తాడు. కాకపోతే శివలో మెయిన్ లీడ్ పెయిర్ మారలేదు. కబీర్ సింగ్ లో ఏ పాత్ర తెలుగు వాళ్ళు వేయలేదు. అదొక్కటే తేడా. ఇంకో రెండు మూడు రోజులు ఆగితే కబీర్ సింగ్ ఏ రేంజ్ లో హిట్ గా నిలవబోతున్నాడో క్లారిటీ వస్తుంది


Tags:    

Similar News