పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేయాలంటే కచ్ఛితంగా స్క్రిప్ట్ ఆ రేంజులోనే వర్కవుట్ కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం జాన్ (ప్రభాస్ 20) చిత్రంలో నటిస్తున్న ప్రభాస్ క్యూలో పలువురు క్రేజీ డైరెక్టర్స్ ఉన్న సంగతి తెలిసిందే. వీళ్లలో నాగ్ అశ్విన్ .. సందీప్ రెడ్డి వంగా.. ప్రశాంత్ నీల్ వంటి టాప్ డైరెక్టర్స్ పేర్లు ఇంతకుముందు వినిపించాయి. ఆ ముగ్గురిలో ముందుగా వర్కవుటయ్యేది ఎవరికి అంటే ఇప్పటికి ఇంకా సస్పెన్స్.
ఆ ముగ్గురు క్రేజీ డైరెక్టర్లలో తొలిగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఆ మేరకు వైజయంతి మూవీస్ అధికారికంగా సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. భారీ కాన్వాసుపై ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీని తెరకెక్కించేందుకు నాగ్ అశ్విన్ రెడీ అవుతున్నారు. అయితే ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మూవీ ఏమైనట్టు? అంటే..
ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్ ఇంకా కథా చర్చల దశలోనే ఉందని తెలిసింది. సందీప్ రెడ్డి వంగా ఇప్పటికీ స్క్రిప్టుపై వర్క్ చేస్తున్నారు. ఇక ఫైనల్ టచ్ ఇచ్చేసి ప్రభాస్ కి వినిపించేందుకు రెడీ అవుతున్నాడని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక టీసిరీస్ అత్యంత భారీగా పాన్ ఇండియా రేంజులో తెరకెక్కించనుందని తెలుస్తోంది. స్క్రిప్టు ఫైనల్ అయిపోతే తదుపరి సందీప్ రెడ్డితో సినిమా ప్రకటన వచ్చేందుకు ఆస్కారం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్ 21 రేస్ లోకి సందీప్ రెడ్డి కూడా వచ్చినట్టేనా? అన్న సందిగ్ధత వ్యక్తమవుతోంది. లేదూ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21.. ఆ తర్వాత సందీప్ రెడ్డితో ప్రభాస్ 22 సెట్స్ కెళ్లేందుకు ఆస్కారం ఉందా? అన్నది తెలియాల్సి ఉంది. ఈలోగానే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సైతం ప్రభాస్ కి కథ వినిపించి రేస్ లో కి దూసుకొచ్చేస్తాడేమో చూడాలి.