సందీప్ వంగాకు మహేష్ సినిమా ఛాన్స్ మిస్..!

Update: 2019-02-28 07:25 GMT
'అర్జున్ రెడ్డి' సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సందీప్ వంగా మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.  సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  ఒక్క సినిమాతోనే సందీప్ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు.  సందీప్ ప్రస్తుతం 'అర్జున్ రెడ్డి' సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు.  హిందీలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే 'అర్జున్ రెడ్డి' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సందీప్ తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించాడు.  సందీప్ ప్రస్తుతం టేకప్ చేసిన హిందీ రీమేక్  పూర్తికాగానే మహేష్ బాబు సందీప్ డైరెక్షన్ లో నటిస్తాడనే వార్తలు గతంలో వచ్చాయి.  సందీప్ ఒక ఇంట్రెస్టింగ్ కథను మహేష్ కు వినిపించి ఓకే చేయించుకున్నాడని కూడా అన్నారు.  మహేష్ - సందీప్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకూ పలు మార్లు మీటింగ్ కూడా జరిగిందట. కానీ తాజా సమాచారం ప్రకారం మహేష్ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టాడని అంటున్నారు.

మహేష్ కు కథ బాగా నచ్చినప్పటికీ హీరో క్యారెక్టరైజేషన్ తనకు సూట్ కాదేమోననే అనుమానాలు ఉన్నాయట. తన ఇమేజ్ కి సూట్ కాని పాత్రలో నటించి రిస్క్ చేయడం ఇష్టంలేక ఈ స్క్రిప్ట్ కు 'నో' చెప్పాడట.  ఈ స్క్రిప్ట్ ను వద్దని చెప్పినప్పటికీ ఫ్యూచర్ లో మాత్రం కలిసి సినిమా చేద్దామని ప్రామిస్ చేశాడట.  ఈ లెక్కన ప్రస్తుతానికి సందీప్ వంగా మహేష్ ను మిస్ చేసుకున్నట్టే.   మరి 'కబీర్ సింగ్' తర్వాత సందీప్ ఎవరితో సినిమా చేస్తాడో వేచి చూడాలి.
    

Tags:    

Similar News