కలర్ ఫోటోతో వచ్చింది.. ముఖచిత్రంతో పోయిందా..?

Update: 2022-12-14 00:30 GMT
షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ప్రతిభ చాటిన సందీప్ రాజ్ తన మొదటి సినిమా కలర్ ఫోటోతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు ప్రాంతీయ విభాగంలో నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. తొలి సినిమాతోనే అంత గొప్ప ప్రతిభ కనబరిచిన సందీప్ రాజ్ తన సెకండ్ సినిమాతో తేలగొట్టేశాడు. సందీప్ రాజ్ లేటెస్ట్ మూవీ ముఖ చిత్రం. ఈ సినిమాని సందీప్ రాజ్ డైరెక్షన్ చేయకపోయినా కథ, స్క్రీన్ ప్లే అతనే అందించాడు. పేరుకి మాత్రమే గంగాధర్ అని వేశారు కానీ దాదాపు సినిమా అంతా సందీప్ రాజ్ డైరెక్ట్ చేశాడని టాక్.

కలర్ ఫోటోతో అంత గొప్ప ఎమోషనల్ డ్రామా నడిపించిన అతను ముఖచిత్రంలో ఆ మ్యాజిక్ రిపీట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. లాస్ట్ ఫ్రైడే రిలీజైన చాలా సినిమాల్లో ముఖచిత్రం ఒకటి. సినిమా కోర్ పాయింట్ బాగానే అనిపించినా దాన్ని తీసిన విధానం ప్రేక్షకులను మెప్పించలేదు.

దాని ఎఫెక్ట్ కలక్షన్స్ మీద కూడా పడింది. ముఖచిత్రం ట్రైలర్ తో సినిమాపై ఆసక్తి కలిగేలా చేసినా.. సినిమా మాత్రం ఎక్కడో తేడా కొట్టేసింది. లవ్ స్టోరీగా మొదలుపెట్టి.. ప్లాస్టిక్ సర్జరీ ట్విస్ట్ ఇచ్చి.. మ్యారిటల్ రేప్ పాయింట్ ఎత్తుకుని.. కోర్ట్ రూం డ్రామాగా ముగిస్తాడు అనుకుంటే చివరకు అది రివెంజ్ స్టోరీ చేశాడు.

కథగా రాసుకున్న లైన్ ఒకటే కాదు ఇన్ని ట్విస్ట్ లు ఆడియన్స్ ని కంగారు పెట్టించాయని చెప్పొచ్చు. సినిమాలో విశ్వక్ సేన్ ఉండటం చివర్లో కొంత హైప్ వచ్చేలా చేసినా అది సరిపోక ఆడియన్స్ పెదవి విరిచారు. లాస్ట్ ఫ్రై డే రిలీజైన సినిమాల్లో ఏది అంత గొప్ప వసూళ్లను రాబట్టడం లేదు. పంచతంత్రం బాగున్నా ఆ సినిమాకు కలక్షన్స్ పెద్దగా లేవు.

కలర్ ఫోటోతో సందీప్ రాజ్ తన టాలెంట్ తో సూపర్ అనిపించగా ముఖచిత్రం సినిమాతో తన లెక్క తప్పాడు. సందీప్ రాజ్. మరి ఈ లెక్క సరిచేయాలి అంటే మాత్రం అతను మళ్లీ మరో సూపర్ హిట్ సినిమా తీయాల్సి ఉంటుంది.

ఈసారి ఇలా తన కథతో వేరే వాళ్ల డైరెక్షన్ అని కాకుండా తన కథని తానే డైరెక్ట్ చేస్తే బెటర్ అని సందీప్ రాజ్ వర్క్ తెలిసిన కొందరు చెప్పుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News