ఏడాది కాలంగా డ్రగ్స్ స్కాండల్ లో సంజన గర్లానీ పేరు ప్రముఖంగా మీడియా హెడ్ లైన్స్ లోకి వచ్చిన సంగతి తెలిసినదే. రెండు నెలల పాటు జైలు జీవితాన్ని సంజన అనుభవించింది. నార్కోటిక్స్ విచారణలో తన తప్పిదాలను అంగీకరించింది. ప్రస్తుతం బెయిల్ పై తను జైలు నుంచి బయటపడ్డారు. ఇక అప్పట్లోనే సంజన్న గల్రానీ ఒక వైద్యుడిని వివాహం చేసుకుందని మొదటిసారి అతని గురించి మాట్లాడిందనే విషయం చాలామందికి తెలియదు.
``ఒకానొక సందర్భంలో నేను వాస్కులర్ సర్జన్ భార్యని అని సంజన తెలిపారు. చాలా సార్లు నా భర్తను పోరు పెట్టాను. కరోనా పీక్ లో ఉన్నప్పుడు కనీసం ఒక నెల అయినా సెలవు పెట్టండి! అని వేధించాను. ఆ సమయంలో మా మధ్య వాదనలు జరిగాయి. ఈ జీవితం అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు సేవ చేయడానికి అని ఆయన చెప్పారు`` అని సంజన వెల్లడించింది.
నిజంగానే డాక్టర్లు `రియల్ హీరోస్`. అందుకే చాలా హ్యాపీ డాక్టర్స్ డే కావాలని కోరుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలను రక్షించారు. మరెవరికీ సాధ్యపడని విధంగా మానవాళికి సేవ చేశారు. నిస్సహాయంగా ఉన్నవారికి సేవ చేసినందుకు వైద్యులందరికీ ధన్యవాదాలు .. డాక్టర్ సాబ్ మీకు భార్యను కావడం నాకు గర్వకారణం.. అంటూ సంజన ఎమోషనల్ గా స్పందించింది.
సంజన రెండో సారి తన భర్త గురించి చాలా సంగతులే తెలిపింది. నిజానికి ఇంతకుముందు తనకు పెళ్లయిందన్న సంగతి కానీ.. భర్త ఉన్నారన్న విషయం కానీ రివీల్ కాలేదు. డ్రగ్స్ వివాదంలో భర్త అన్న టాపిక్ తెరపైకొచ్చింది. చాలా మంది కథానాయికలు తమ పెళ్లి వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా దాచేస్తారన్నది ఆ క్రమంలోనే బయటపడింది కూడా.
సంజన ఇటీవలే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రీయాక్టివేట్ అయ్యారు. ఠఫ్ యోగా ఫీట్స్ ని షేర్ చేయగా అవి అంతర్జాలంలో అగ్గి రాజేసాయి. సంజన తన యోగా కోచ్ సమక్షంలో రకరకాల ప్రయోగాలు చేయడం ఉత్కంఠ పెంచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తిరిగి దక్షిణాది సినిమాల్లో నటించే ప్రయత్నాల్లో ఉంది. తెలుగు-తమిళంలో తిరిగి తన స్థానాన్ని పదిలం చేసుకోవాలనే ట్రై చేస్తోందట. అయితే జరిగిన ఇన్సిడెంట్స్ తర్వాత తనకు అవకాశాలు ఇవ్వడం అంత సులువేమీ కాదన్న టాక్ వినిపిస్తోంది. మరి సంజన గ్లామర్ వరల్డ్ లో ఎలాంటి బ్యాటిల్ సాగించనుందో వేచి చూడాలి.