హీరోయిన్ సంజన ప్రస్తుతం హైద్రాబాద్ లోనే ఉంటూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా పలు కీలక సన్నివేశాల చిత్రీకరణలో భాగం అవుతోంది. అయితే తొలిసారిగా పవన్ తో జత కట్టిన సంజన మాత్రం.. పవర్ స్టార్ తో నటించాలన్న తన కోరిక తొలిసారిగా తీరడంతో మహా హ్యాపీగా ఉంది. అలాగే ఈమెకు డైరెక్టర్ బాబీ కూడా ముందు నుంచి తెలియడంతో.. అతనితో కలిసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇస్తోందని చెబుతోంది సంజన.
'నేను సర్దార్ లో ఓ సాంప్రదాయ తెలుగమ్మాయి పాత్రను పోషిస్తున్నాను. ఎక్కువగా పట్టు చీరలు కట్టుకునే కనిపించే రోల్ ఇది. ఆల్మోస్ట్ ఒక రాణిలా ఈ మూవీలో నేను కనిపిస్తాను' అని చెప్పిన సంజన.. ఇంతకంటే తన కేరక్టర్ గురించి డీటైల్స్ రివీల్ చేయడం మాత్రం కుదరదని తేల్చేసింది. గతంలో చాలావరకూ గ్లామర్ కేరక్టర్లు చేసిన తనకు.. ఇది పూర్తి విభిన్నమైన రోల్ అని, ఇలాంటి పాత్రను ఆఫర్ చేయడంతో చాలా ఆశ్చర్యపోయానన్నది సంజన మాట.
సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల కోసం సంజన చాలా ఆతృతగా ఎదురుచూస్తోందట. దీనికి కారణం మొదటి సారిగా పవన్ కళ్యాణ్ పక్కన తను ఎలా ఉందో.. బిగ్ స్క్రీన్ పై చూసుకోవాలన్న కోరిక అని.. ఫ్యాన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ ను ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటున్నానని అనింది సంజన.