హాట్ హీరోయిన్ యోగా సెంట‌ర్

Update: 2015-09-19 13:30 GMT
స్టార్ హీరోయిన్‌ లంతా ఒక్కొక్క‌రు ఒక్కో ఆదాయ మార్గాన్ని ఎంచుకుంటూ బిజినెస్‌ తో బిజీ అయిపోతున్నారు. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాలి అన్న చందంగా స‌ద‌రు నాయిక‌లు ర‌క‌ర‌కాల వ్యాపార మార్గాల్ని అన్వేషిస్తూ వాటి ఎస్టాబ్లిష్‌ మెంట్ ప‌నిలో మునిగి తేలుతున్నారు. ఓ వైపు షూటింగ్ షెడ్యూల్స్‌, మ‌రో వైపు సొంత వ్యాపారాల ప్ర‌చారం రెండిటితో క్ష‌ణం తీరిక లేకుండా కాలం గ‌డిపేస్తున్నారు. త‌మ‌న్నా వైట్ అండ్ గోల్డ్ పేరుతో బంగారం వ్యాపారం చేస్తోంది. తాప్సీ ఈవెంట్ మేనేజ్‌ మెంట్ కంపెనీ పెట్టుకుంది. ఇత‌ర హీరోయిన్ ల‌లో చాలామంది వ‌స్ర్త వ్యాపారంలో ఉన్నారు.         

అయితే ఇదంతా చూస్తూ ఇన్‌ స్ప‌యిర్ అయ్యిందో ఏమో క‌న్న‌డ బ్యూటీ సంజ‌న  కూడా సొంత వ్యాపారాల‌పై దృష్టి సారించింది. ఈ అమ్మ‌డు ఇప్పుడు బెంగ‌ళూరు స‌మీపంలో కోర‌మంగ‌ళ అనే ప్లేస్‌ లో ఓ యోగా సెంట‌ర్‌ ని నిర్మిస్తోంది. ఈ యోగా లాంజ్‌ లో స‌మ‌స్థ స‌దుపాయాలు క‌ల‌వు.. అని ఇప్ప‌ట్నుంచే ప్రచారం మొద‌లెట్టేసింది. ఐడియా బాగానే ఉంది. అంద‌రిలో రొటీన్‌ గా ఆలోచించ‌కుండా మూస‌లో కొట్టుకుపోకుండా తెలివైన ప్లానింగే చేసింది సంజ‌న‌. మ‌న టాలీవుడ్ నుంచి మెజారిటీ భాగం సెల‌బ్రిటీలంతా బెంగ‌ళూరు వెళ్లి అక్క‌డ కేర‌ళ మ‌సాజ్‌ ల‌కు అల‌వాటు ప‌డిపోయారు. కాబ‌ట్టి వీళ్లంద‌రికీ అక్క‌డ త‌నే ట్రీట్ ఇస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించిన‌ట్టుంది. బిజినెస్‌ కి బిజినెస్ .. త‌ర్వాత సినిమాల్లో ఛాన్సులు అన్నిటికీ ఈ యోగా లాంజ్ ఓ ఆలంబ‌న‌గా మారుతుందేమో చూడాలి.

కేవ‌లం పార్టీలు, పెళ్లి  విందుల్లో డ్యాన్సు కార్య‌క్ర‌మాలతో అల‌రించ‌డ‌మే కాదు, స్టేజీ షోల్లో, డిస్కోథెక్ చిందుల‌తో కుర్ర‌కారుకు వేడెక్కించ‌డ‌మే కాదు .. ఇలా ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని కాపాడే ప‌నులు కూడా చేస్తోంది. ఇంకేం ఉంది సంజ‌న అన్న కార్డ్‌ తోనే ఈ యోగా లాంజ్ పాపుల‌ర్ అయిపోవ‌డం ఈజీ. ప్లాన్ బావుంది.
Tags:    

Similar News