బాలీవుడ్ యావత్తు ఈ నెల 29న విడుదల కానున్న సంజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇది వట్టి రన్బీర్ కపూర్ సినిమా అయితే ఇందులో సగం హైప్ కూడా ఉండేది కాదు. సంజయ్ దత్ బయోపిక్ అందులోనూ రాజ్ కుమార్ హిరానీ దర్శకుడు కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బాలన్స్ ఏమైనా ఉంటె వాటిని ట్రైలర్ పూర్తి చేసేసింది. పీకే తర్వాత హిరానీ తీసిన మూవీ కావడంతో ఆ రకంగా కూడా బిజినెస్ మీద భారీ పెట్టుబడులు వచ్చాయి. ట్రేడ్ వేస్తున్న లెక్కల ప్రకారం సంజు కనీసం 240 కోట్ల దాకా షేర్ తెస్తేనే దీన్ని బ్లాక్ బస్టర్ కింద జమకట్టవచ్చట. అంత కన్నా తక్కువ వస్తే మాత్రం నష్టాలు ఖాయం అంటున్నారు.
కానీ బజ్ చూస్తుంటే అదేమంత పెద్ద టాస్క్ కాదనిపిస్తోంది కానీ టాక్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. పోయిన వారం వచ్చిన రేస్ 3 డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా పండగ సీజన్ ప్లస్ సల్మాన్ ఇమేజ్ తోడయ్యి వంద కోట్ల వసూళ్లు ఈజీగా దాటేసింది. కానీ సంజు కేసు వేరు. రన్బీర్ కపూర్ కు అందులో సగం మార్కెట్ కూడా లేదు. భారం మొత్తం సంజయ్ దత్ బ్రాండ్ తో పాటు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం మీద పడింది .
ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్న సంజుకు మొన్న ఆదివారం నుంచే అడ్వాన్స్ బుకింగ్ పెట్టేయడంతో వసూళ్ల జాతర ప్రారంభమయ్యింది. ట్రైలర్ ను బట్టి చూస్తే సంజయ్ దత్ జీవితాన్ని చాలా రియలిస్టిక్ గా తీర్చిదిద్దిన తీరు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఓ రేంజ్ లో అంచనాలు పెంచేసింది. స్వర్గీయ సునీల్ దత్ వారసుడిగా పరిశ్రమలోకి అడుగు పెట్టడం స్టార్ అయ్యాక ముంబై పేలుళ్లలో ప్రమేయం ఉన్నట్టు రుజువులు దొరకటం ఇలా అన్ని పెట్టేసాడు రాజ్ కుమార్ హిరానీ. ఇదంతా ఒక ఎత్తు అయితే మూడు వందల అమ్మాయిలతో డేటింగ్ చేసినట్టుగా చెప్పుకునే సంజయ్ దత్ జీవితంలో అమ్మాయిల పాత్ర ఏంటి అనేది కూడా ఇందులో చూపించబోతున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ లేదు.
సంజు విడుదల అయ్యే సమయానికి రేస్ 3 చాప చుట్టేసినట్టే. సో ఇది మంచి ఛాన్స్. పదేళ్ల క్రితమే తన సినిమాకు వందల కోట్ల వసూళ్లు సాధ్యం అని నిరూపించిన రాజ్ కుమార్ హిరానీకి సంజుతో పాత్ర రికార్డ్స్ బ్రేక్ చేయటం పెద్ద పనేం కాదు. మరి ఇంత భారాన్ని మోసుకొస్తున్న సంజు ఎంత వరకు సక్సెస్ అవుతాడో శుక్రవారం దాకా వేచి చూడాలి.