మున్నాభాయ్ ఎంబిబిఎస్.. 3 ఈడియట్స్.. పీకె.. సినిమాలను చూస్తే ఏం గుర్తొస్తుంది? రియాల్టీకి దగ్గర్లో ఉండే సీన్లు. కడుపుబ్బా నవ్వించే డైలాగులూ. హృదయాన్ని రగిలించే ఎమోషన్లు. మొత్తంగా మానవత్వం చుట్టూ తిరిగే కథలు. అవే గుర్తొస్తాయ్. ఎందుకంటే అవన్నీ తీసింది దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి. అటువంటి దర్శకుడు ఇప్పుడు సీనియర్ హీరో సంజయ్ దత్ పై ఒక బయోపిక్ తీస్తే ఎలా ఉంటుంది? ఇప్పటివరకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా.. ఈ ట్రైలర్ రాకతో అన్నీ క్లియర్ అయిపోయాయ్.
''సంజూ'' అంటూ సంజయ్ దత్ పై సినిమాను తీసేశాడు హిరాణి. ఈ సినిమాలో సంజయ్ పాత్రలో రణబీర్ కనిపిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ ట్రైలర్ చూస్తున్నంత సేపూ అదేదో నిజంగానే సంజయ్ దత్తునే చూస్తున్నాం అన్నంతా మరిపించాడు రణబీర్. అంతేకాదు.. అతని మేకప్.. నటన.. అతని డైలాగ్ డెలివరీ.. అన్నీ టాప్ క్లాసులో ఉన్నాయ్. సినిమాలో సంజయ్ జీవితంలోని డ్రగ్స్.. అమ్మాయిలూ.. అక్రమంగా మారణాయుధాలు కలిగియుండటం.. కేసులు.. జైలు.. జైల్లో కష్టాలు.. రకరకాల హీరోయిన్లతో ఎఫైర్లు.. అబ్బో చాలా ఉన్నాయ్. కామెడీ నుండి ట్రాజెడీ వరకు.. అన్నీ టచ్ చేశాడు రాజు హిరాణి. ఓవరాల్ గా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించినట్లే ఉన్నాడు.
అలాగే ట్రైలర్లో సోనమ్ కపూర్ యాక్టింగ్ కూడా అదిరిపోయింది. తన మంగళసూత్రం కోసం అడిగినప్పుడు.. ఆమె మెడలో ఒక టాయిలెట్ సీట్ వేస్తాడు సంజూ. అయితే ఆ సీన్ ఏ హీరోయన్ తో జరిగిందో తెలియదు కాని..ఒక ప్రముఖ పెళ్ళయిన హీరోయిన్ పేరు మాత్రం ఆ పాత్రకు ఇన్ స్పిరేషన్ అంటూ ఇప్పుడు బాలీవుడ్ కోడై కూస్తోంది. మొత్తానికి జూన్ 28న రిలీజవ్వనున్న సంజు ట్రైలర్ తో రాజు హిరాణి అరిపించేశాడు.
Full View