‘ఘాజీ’ దర్శకుడికి ఎంత కాన్ఫిడెన్స్ అంటే..

Update: 2017-01-25 10:47 GMT
ఘాజీ.. ఇండియాలో తెరకెక్కిన తొలి అండర్ వాటర్.. సబ్ మెరైన్ వార్ ఫిలింగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న సినిమా. ఇలాంటి భారీ చిత్రాన్ని ఓ డెబ్యూ డైరెక్టర్ రూపొందిస్తుండటం విశేషం. అతడి పేరు సంకల్ప్ రెడ్డి. మన తెలుగువాడే. 1971 నాటి ఇండియా-పాకిస్థాన్ యుద్ధం మీద రీసెర్చ్ చేసి ‘ఘాజీ’ పేరుతో ఓ పుస్తకం రాసిన సంకల్ప్.. దాని మీద సినిమా కూడా తీయడానికి రెడీ అయ్యాడు. ఐతే ఓ డెబ్యూ డైరెక్టర్ ఇలాంటి సినిమా తీయగలడని నిర్మాత ఎలా నమ్మాలి..? అందుకే అతను పక్కా ప్రణాళికతో పీవీపీని కలిశాడట. ముందే సబ్ మెరైన్ సెట్ రూపొందించి.. కొంత సీజీ వర్క్ కూడా చేయించి.. స్క్రిప్టు పక్కాగా రాసుకుని పీవీపీని కలిశాడట.

ముందు స్క్రిప్టు వినిపించాక.. తన బృందంతో రెడీ చేయించిన సబ్ మెరైన్ సెట్ దగ్గరికి పీవీపీని తీసుకెళ్లి.. అది చూపించి.. సినిమాను ఎలా తీయాలనుకుంటున్నది సెట్లోనే లైవ్ చూపించి ఆయన్ని ఇంప్రెస్ చేశాడట. దీన్ని బట్టి అతడికి ‘ఘాజీ’ సినిమా విషయంలో ఎంత క్లారిటీ ఉందో.. ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ముందు తాను ఈ స్క్రిప్టును వేరే ప్రొడ్యూసర్లకు వినిపించానని.. ఐతే ఇందులో హీరోయిన్ లేదని.. పాటల్లేవని.. ఐటెం సాంగ్ కూడా లేదని చాలామంది తిరస్కరించారని.. ఆ తర్వాతే తాను మరింత పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకుని.. పీవీపీని కలిసి ఆయన్ని ఇంప్రెస్ చేశానని సంకల్ప్ వెల్లడించాడు. ఈ సినిమా స్క్రిప్టు కొంచెం లెంగ్తీగా రాశానని.. ఐతే ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు షూటింగ్ మొదలవడానికి ముందే స్క్రిప్టు దశలోనే ఎడిటింగ్ చేసి.. సినిమాను షార్ప్ గా తయారు చేశారని సంకల్ప్ తెలిపాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News