ఇండస్ట్రీలో ఏళ్లకు ఏళ్లు పని చేసిన అనుభవం లేదు. చేతిలో పెద్దగా బడ్జెట్ లేదు. అయినప్పటికీ ఒక తొలి చిత్ర దర్శకుడు ‘ఘాజీ’ లాంటి సినిమాను పకడ్బందీగా తీసి ఆశ్చర్యపరిచాడు. అతనే.. సంకల్ప్ రెడ్డి. ‘ఘాజీ’ సినిమాతో తెలుగే కాక పాటు హిందీ.. తమిళ ప్రేక్షకుల దృష్టినీ ఆకర్షించిన సంకల్ప్.. కొంత విరామం తర్వాత తన రెండో సినిమాకు రెడీ అయ్యాడు. మెగా కుర్రాడు వరుణ్ తేజ్ హీరోగా అతను తన కొత్త సినిమా మొదలుపెడుతున్నాడు. తొలి సినిమా ‘ఘాజీ’ తరహాలోనే ఇది కూడా వైవిధ్యమైన కథతో తెరకెక్కబోయే ప్రయోగాత్మక చిత్రమే.
ఇండియన్ సినిమాలో అత్యంత అరుదైన స్పేస్ బ్యాక్ డ్రాప్ లో తన రెండో సినిమాను తెరకెక్కించబోతున్నాడు సంకల్ప్. ‘ఆదిత్య 369’.. ‘చందమామలో అమృతం’ లాంటి సినిమాల్లో స్పేస్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది కానీ.. ఈ జానర్లో పూర్తి స్థాయి సినిమాలు ఇండియాలో అరుదు. ఐతే ఈ మధ్యే తమిళంలో ‘టిక్ టిక్ టిక్’ అనే సినిమా ఈ తరహాలో తెరకెక్కిన తొలి ఇండియన్ మూవీగా పేరు తెచ్చుకుంది. సంకల్ప్ కూడా అదే తరహాలో పూర్తి స్థాయి స్పేస్ ఫిల్మ్ తీయబోతున్నాడట. రూ.25 కోట్ల పరిమిత బడ్జెట్లోనే ఈ సినిమాను తెరకెక్కించనున్నాడట సంకల్ప్. అతడి తొలి సినిమా ‘ఘాజీ’ రూ.15 కోట్ల పరిమిత బడ్జెట్లో తెరకెక్కింది. కానీ సినిమాలో క్వాలిటీ చూస్తే భారీగా ఖర్చు చేసినట్లుంటుంది. తొలి సినిమా తరహాలోనే పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా తక్కువ బడ్జెట్లో తీయడానికి ప్రణాళికలు రచించాడట సంకల్ప్. ఏప్రిల్లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. సినిమాలో క్యారెక్టర్ కోసం దర్శకుడు ఇటీవల చాలా సేపు వరుణ్ తో చర్చలు జరిపాడు. అంతే కాకుండా స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకోవాలని కూడా చెప్పాడట. దీంతో మెగా హీరో బ్యాంకాక్ గాని లేక అమెరికా గాని పయనమవ్వనున్నాడని సమాచారం అందుతోంది.