టాలీవుడ్ నుండి సంక్రాంతి పోరు ఈ సారి కాస్త సీరియస్ గానే సాగబోతుంది. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు బాలయ్య వీర సింహారెడ్డి సినిమా కూడా సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతుంది. ఈ రెండు సినిమాలు కాకుండా దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న విజయ్ యొక్క వారసుడు సినిమా కూడా సంక్రాంతికి విడుదల కాబోతుంది.
వీరసింహారెడ్డి మరియు వాల్తేరు వీరయ్య సినిమాల గురించే ఎక్కువ ప్రచారం జరుగుతోంది. వారసుడు సినిమా ను జనాలు పెద్దగా పట్టించుకుంటారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దిల్ రాజు వారసుడు సినిమాను డైరెక్ట్ తెలుగు సినిమా అంటూ ఎంత మొత్తుకున్నా కూడా డబ్బింగ్ సినిమా అన్నట్లుగానే చాలా మంది ఫీల్ అవుతున్నారు.
వారసుడు సినిమా కచ్చితంగా సంక్రాంతికి విడుదల కాబోతున్న చిరు మరియు బాలయ్య సినిమాలకు గట్టి పోటీ ఇస్తుందనే నమ్మకంను దిల్ రాజు టీం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు ఉన్న బజ్ మరియు సినిమా యొక్క ఔట్ పుట్ నేపథ్యంలో వారసుడు సినిమా ఏకంగా 50 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందనే వార్తలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు విజయ్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా తెలుగు డబ్బింగ్ వర్షన్ 20 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేయలేక పోయింది. అందుకే ఈ సినిమా కూడా అంతే అనుకున్నారు. కానీ వారసుడు ప్రీ రిలీజ్ బిజినెస్ 50 కోట్లు అవ్వడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమాలు రెండు కలిసి దాదాపుగా వంద వంద కోట్ల చొప్పున రెండు వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాయి. వారసుడు సినిమా అందులో సగం 50 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కనుక కచ్చితంగా ఆ సినిమాలకు వారసుడు ఏం తక్కువ కాదు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. విడుదల తర్వాత ఎవరి సత్తా ఎంత అనేది క్లారిటీ వస్తుందేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.