కొన్ని పాటలకు స్వరంతో పాటు బాణి కుదిరితే ఎంత అందంగా ఉంటుందో ఈ పాట ఎగ్జాంపుల్. కార్తి- రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం సుల్తాన్ .. కింగ్ నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ తో పోటీపడుతూ ఏప్రిల్ 2న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. సుల్తాన్ నుంచి తాజాగా సంతోషం.. లిరికల్ వీడియో రిలీజైంది.
ఈ వీడియో ఆద్యంతం మేకింగ్ పరంగా విజువల్ బ్రిలియన్సీతో కట్టి పడేస్తోంది. పండంటి కుర్రాడు అంటూ ప్రారంభమయ్యే ఈ లిరిక్ ఆద్యంతం గాయకుడు కైలాష్ ఖేర్ ఛమత్కారమైన విరుపుతో కూడిన గానం ఆకట్టుకుంటుంది. బాణీ కొత్త పంథా కాదు. లిరిక్ అసాధారణం కాదు. కానీ ఇంకేదో పదలాలిత్యం చక్కని ట్యూన్ కట్టి పడేస్తాయి. రాకేందు మౌళి లిరిక్.. వివేక్ మెర్విన్ సంగీతం వందశాతం విజువల్ పర్ఫెక్షన్ తో ఈ పాట ఆకట్టుకుంది.
సుల్తాన్ రేంజుకు తగ్గట్టే పాటలో కార్తికి చక్కని ఎలివేషన్ ఉంది. అలాగే పల్లె పట్టు అందగత్తెగా రష్మిక మందన పూలజడలు చీరకట్టు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఓవరాల్ గా ఈ పాట సుల్తాన్ కి పెద్ద ప్లస్ అని చెప్పాలి. బక్కియరాజ్ కన్నన్ సుల్తాన్ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కార్తీ ఈ సినిమాతో మరో చక్కని విజయం అందుకోవాలన్న తపనతో కనిపిస్తున్నాడు. తన ఊపిరి కోస్టార్ కింగ్ నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ తో పోటీపడుతున్నా.. ఇవి రెండూ వేటికవే విభిన్నమైన జోనర్లలో వస్తున్న సినిమాలు కాబట్టి బాక్సాఫీస్ వద్ద నిరూపించుకునే అవకాశం ఉందనే భావిస్తున్నారు.
Full View