ప్రభాస్ లో ఎలాంటి మార్పు లేదు .. నిజంగా ఆయన చాలా గ్రేట్: సంతోష్ శోభన్

Update: 2021-10-15 02:30 GMT
సంతోష్ శోభన్ హీరోగా నిలదొక్కుకోవడానికి గట్టిగానే కృషి చేస్తున్నాడు. 'పేపర్ బాయ్'ను ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా, 'ఏక్ మినీ కథ'తో అందరి దృష్టిలో పడ్డాడు. ఆ సినిమాతో ఒక మంచి హిట్ పట్టుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'మంచిరోజులు వచ్చాయి' రూపొందింది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా, వచ్చేనెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమా ఇప్పుడు ప్రెమోషన్ల దిశగా పరుగులు తీస్తోంది. తాజా ఇంటర్వ్యూలో సంతోష్ శోభన్ మాట్లాడాడు.

"ఇప్పుడు మాస్కులు పెట్టుకున్నా సినిమా థియేటర్లకు వెళ్లగలుగుతున్నాము అంటే సినిమాలకు 'మంచి రోజులు వచ్చాయి' అనే చెప్పాలి. ఇక మిగతావారి సంగతి అలా ఉంచితే ఒక హీరోగా నాకు కూడా మంచిరోజులు వచ్చినట్టే. కరోనా భయాన్ని పక్కన పెట్టేసి ఎవరి ఫ్యామిలీతో వారు హ్యాపీగా ఉన్నారు. అలా చూసుకుంటే అందరికీ మంచి రోజులు వచ్చినట్టే. సాధారణంగా మా నాన్నగారి గురించిన ప్రస్తావన రాగానే, 'వర్షం' సినిమాను గురించి మాట్లాడతారు. ప్రభాస్ ను నేను అన్నా అని పిలుస్తుంటాను. ఈ రోజున ఆయన ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆ సినిమానే అని చెబుతారు.

కానీ ఆ సినిమాకి ముందు మా నాన్నగారు ఒక ఫ్లాప్ తో ఉన్నారు. అలాంటి ఆయనకి ప్రభాస్ గారు ఛాన్స్ ఇచ్చారు. ఒక రకంగా నాన్నగారి కెరియర్ నే ఆయన నిలబెట్టారనుకోవాలి. మా నాన్నగారు మంచి హిట్ ఇచ్చారు కనుకనే నన్ను ప్రభాస్ గారు సపోర్ట్ చేస్తూ ఉంటారని అంతా అనుకుంటూ ఉంటారు. దానిని నేను పాజిటివ్ గానే తీసుకుంటాను. నిజంగానే ఆయనది ఎంతో గొప్పమనసు. అలాంటి ఆయనకి నేను అభిమానిని అని చెప్పుకోవడానికి గర్వపడుతూ ఉంటాను. 'వర్షం' సినిమా సమయానికి నేను 3rd క్లాసో .. 4th క్లాసో  చదువుతున్నాను. ఆ సినిమా సమయంలో నాన్నగారితో కలిసి చేసిన జర్నీ ప్రభాస్ గారికి ఇష్టం. అది ఆయన ఇప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉంటారు.

ప్రభాస్ గారిని నేను త్రీ .. ఫోర్ టైమ్స్ కలిసి ఉంటాను. నా సినిమాలకి ఆయన బైట్స్ ఇవ్వడం .. ట్వీట్లు చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. 2004లో ప్రభాస్ గారిని కలిసిన నేను, మళ్లీ ఆయనను కలిసింది 2018లోనే. అప్పటితో పోలిస్తే 'బాహుబలి' తరువాత ఆయన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయినా ఆయన అంతకుముందులానే ఆప్యాయంగా పలకరించి ఆదరించారు. నిజంగా ఆయనది చాలా గొప్ప వ్యక్తిత్వం. యూవీ బ్యానర్లో అవకాశాలు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. బయటి బ్యానర్లకు కూడా చేస్తున్నాను.

ఇక 'మంచి రోజులు వచ్చాయి' సినిమాలో కామెడీ అనేది కావలసినంత ఉంది. నాకు కామెడీ చూడటమన్నా .. కామెడీ చేయడమన్నా చాలా ఇష్టం. మారుతి గారి సినిమాల్లో ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే కామెడీ ఉంటుంది. ఈ సారి ఈ సినిమాలో కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రిలీజ్ డేట్ ఎంత తొందరగా ముందుకు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూడాలా అని ఆత్రుతతో ఉన్నాను. థియేటర్లలో ఈ సినిమా చూస్తే అదిరిపోతుంది. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం నాకు ఉంది" అని చెప్పుకొచ్చాడు.  
Tags:    

Similar News