సారా అలీ ఖాన్ స్నేహితురాలు అనన్య పాండేతో కలిసి దోహాలో బ్లాస్టింగ్ సెలబ్రేషన్స్ తో అదరగొడుతోంది. ఖతార్ లో వెకేషన్ లో ఉన్న ఇద్దరు నటవారసురాళ్లు ఇన్ స్టాగ్రామ్ లో ఒక చక్కని వీడియోను విడుదల చేసారు. ఈ వీడియో చూడగానే యూత్ నుంచి స్పందన అంతే జోరుగా ఉంది. చూస్తుంటే ఈ ఇద్దరూ డేటింగ్ కు వెళ్లినట్టే కనిపిస్తోందంటూ అభిమానులు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎగ్జోటిక్ లొకేషన్ లో ఇస్మార్ట్ లుక్ లో కనిపిస్తున్న ఈ భామల మధ్య స్నేహం ఆప్యాయతానురాగాలు కట్టి పడేస్తున్నాయి. సారా అలీ ఖాన్- అనన్య పాండే ఖతార్ డైరీస్ అభిమానులకు ఫ్రెండ్షిప్ గోల్స్ ని నిర్ధేశిస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు.
సారా దోహాలో తన ఔటింగ్ కోసం మనీష్ మల్హోత్రా డిజైనర్ దుస్తులను ఎంచుకుంది. గులాబీ - ఆకుపచ్చ పూల ఎంబ్రాయిడరీ సిల్హౌట్ డిజైన్ మతో కూడిన హై-నెక్ స్లీవ్ లెస్ కుర్తా-స్టైల్ టాప్ ధరించింది. నల్లటి ఫ్లేర్డ్ ప్యాంట్- హై హీల్స్ ధరించి షో స్టాపర్ గా కనిపిస్తోంది. సారాకు ఏమాత్రం తగ్గని రీతిలో అనన్య పాండే టైట్ హగ్గింగ్ వైట్ లాంగ్ డ్రెస్ లో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో అభిమానుల్లో వైరల్ గా మారింది. చక్కనమ్మలు దుబాయ్ విలాసాల్లో జల్సాలు మరిగారు! అంటూ ఫ్యాన్స్ గమ్మత్తయిన కామెంట్లు చేస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే .. నటవారసురాళ్లు క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నారు. సారా అలీఖాన్ విక్కీ కౌశల్ తో లక్ష్మణ్ ఉటేకర్ తదుపరి చిత్రం చేస్తోంది. విక్రాంత్ మాస్సేతో `గ్యాస్ లైట్`- `ఏ వతన్ మేరే వతన్` చిత్రీకరణ దశలో ఉన్నాయి. సారా తదుపరి అనన్య పాండేతో కలిసి `ఖో గయే హమ్ కహాన్`లో కనిపించనుంది. `డ్రీమ్ గర్ల్ 2`లో అనన్య పాండే కథానాయికగా నటించనుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.