పటౌడీ వంశపు వారసుడు.. చోటా నవాబ్ తైమూర్ అలీఖాన్ చిద్విలాసం తెలిసిందే. నవాబ్ సాబ్ బర్త్ డే వేడుకలు నేడు. ఈ సందర్భంగా ప్రతి యేడాదిలానే బాలీవుడ్ కదిలొచ్చింది. ఈ బర్త్ డే పార్టీలో సైఫ్-కరీనా జంటతో పాటు కరిష్మా కపూర్- కరణ్ జోహార్ - తైమూర్ మేనత్త సోహా అలీఖాన్ .. వీళ్లంతా పిల్లలు సహా విచ్చేశారు. ఇదే వేడుకలో జెనీలియా-రితేష్ దంపతులు కిడ్స్ తో పాటు సందడి చేశారు. తైమూర్ అమ్మమ్మ గారు బబిత ఈవెంట్లో కనిపించారు.
ఇది తైమూర్ కి మూడో పుట్టినరోజు. అయితే తనకు ఇంతకుముందు లానే ఖరీదైన కానుకలెన్నో అందాయి. తైమూర్ అలీఖాన్ తొలి బర్త్ డేకి అప్పట్లో సైఫ్ బంధువు ఒకరు ఏకంగా ఒక గార్డెన్ నే కానుకగా ఇచ్చిన సంగతిని మర్చిపోలేం. అయితే ఈసారి పడౌడీ బోయ్ కి అలాంటి కానుక ఏదైనా అందించేవాళ్లు రాలేదా ఏమో!
ఈ బర్త్ డే పార్టీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ మిస్సింగ్. ఎవరా ముఖ్యమైన వ్యక్తి అంటే..ఇంకెవరు సైఫ్ గారాల పట్టీ.. అందాల కథానాయిక సారా అలీ ఖాన్. తమ్ముడి బర్త్ డే పార్టీలో సారా మిస్సవ్వడంతో ఏదో లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. అయితే తాను లేకపోయినా సారా స్వయంగా తమ్ముడు తైమూర్ పై ప్రేమాభిమానాల్ని చాటుకున్న తీరు ఆకట్టుకుంది. తైమూర్ కి ముద్దుపెడుతూ మురిపెంగా ఉన్నప్పటి ఓ ఫోటోని సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేసిన సారా.. ``హ్యాపీ బర్త్డే చిన్నారి టిమ్ టిమ్`` అంటూ ప్రేమ చాటుకుంది. ఈ ఫోటోలో సారా ఎంతో ట్రెడిషనల్ గా లవ్ లీగా కనిపిస్తోంది. `అందమైన అక్కాతమ్ముళ్లు మీ ఇద్దరూ` అంటూ నెటిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సారా ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీబిజీగా ఉంది. కేదార్ నాథ్- సింబా తర్వాత వరుసగా సినిమాలకు కమిటై క్షణం తీరిక లేనంత బిజీ షెడ్యూల్స్ తో కెరీర్ ని సాగిస్తోంది. అందుకే ఈ బర్త్ డే కి తమ్ముడిని మిస్సయ్యిందన్నమాట. సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అమృతకు జన్మించిన సారా.. రెండో భార్య కరీనాకపూర్ కుమారుడు అయిన తైమూర్ పై ఎంతో ప్రేమ కురిపిస్తుంది.