నేటివ్ గా కోలీవుడ్ నటుడు అయినా.. శరత్ కుమార్ కు తెలుగు సినిమా పరిశ్రమతో చాలానే అనుబంధం ఉంది. అందుకే తరచుగా తెలుగు సినిమాల్లో కనిపిస్తూ ఉంటాడు. తమిళంలో హీరో పాత్రలు చేస్తూ కూడా.. తెలుగులో కేరక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ కొనసాగించాడు శరత్ కుమార్. ఈయనకు మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేక అనుబంధం ఉంది. అప్పట్లో గ్యాంగ్ లీడర్.. స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ వంటి చిత్రాల్లో చిరుతో కలిసి నటించాడు.
ఇప్పుడు సాయిరాం శంకర్ హీరోగా నటించిన 'నేనో రకం' మూవీలో ఓ కీలక పాత్ర చేసిన శరత్ కుమార్.. మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. చిరంజీవితో తన అనుబంధాన్ని పంచుకున్నాడు. 'సుహాసిని గారు స్టార్ట్ చేసిన ఎయిటీస్ గ్రూప్ తో అందరి మధ్యా రిలేషన్ ఏర్పడింది. చిరంజీవిగారితో అనుబంధం మరింతగా పెరిగింది. నేను ఆర్థికంగా సమస్యల్లో ఉన్నపుడు ఆయనను కలిసి.. మీతో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాను. ఆయనకు విషయం చెప్పాక.. దీనికి ఇంత దూరం రావాలా అన్నారు. రెమ్యూనరేష్ గురించి అడిగితే.. "నాకు నువ్వు రెమ్యూనరేష్ ఇస్తావేరా" అని.. ముందు సినిమా చెయ్.. తర్వాత చూద్దాంలే అనడం నేను ఎప్పటికీ మర్చిపోలేను' అని చెప్పాడు శరత్ కుమార్.
'అందుకే నాకు చిరంజీవి ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటారు. అప్పట్లోనే నేను పెద్ద హీరో అవుతానని చిరు చెప్పారు. నిజంగానే పద్ద హీరో అయాను. అయితే.. సినిమా మాత్రం చేయలేకపోయాను. ఖైదీ నంబర్ 150లో ఓ చిన్న పాత్రలో అయినా కనిపిస్తానని అడిగాను కానీ.. కుదరలేదు. చిరంజీవితో అవకాశం వస్తే.. ఏ చిన్న పాత్ర అయినా చేయడానికి రెడీ' అని చెప్పాడు శరత్ కుమార్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/