నేనెప్పుడూ జయలలిత కాళ్లపై పడలేదు: శరత్ కుమార్

Update: 2021-11-11 17:30 GMT
తమిళంలోని సీనియర్ స్టార్ హీరోలలో శరత్ కుమార్ ఒకరు. 90వ దశకంలో ఆయనకి తమిళనాట విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉండేది. ఆ సమయంలోనే ఆయన తెలుగులో 'మగాడు' .. 'సూర్య ఐపీఎస్' .. 'గ్యాంగ్ లీడర్' .. ' 'స్టూవర్టు పోలీస్ స్టేషన్' వంటి సినిమాలు చేశారు. ఆ తరువాత ఆయన తమిళ సినిమాలను వరుసగా చేసుకుంటూ వెళ్లారు. చాలాకాలం వరకూ ఆయన తెలుగు సినిమాల వైపు చూడకపోవడానికి కారణం తమిళ సినిమాలతో బిజీగా ఉండటమే. 1991 తరువాత 2005లో వచ్చిన 'బన్నీ' సినిమాలో భూపతి రాజా పాత్రలో ఆయన కనిపించారు.

ఈ మధ్య కాలంలో ఆయన చేసిన గుర్తుపెట్టుకోదగిన సినిమా ఏదంటే 'జయ జానకి నాయక' అనే చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు ఆయన తెలుగు .. తమిళ భాషల్లో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చేస్తున్నారు. రీసెంట్ గా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' షూటింగ్ శరత్ కుమార్ తో జరిగింది. ఈ ఆదివారం రాత్రి 8:30 నిమిషాలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానున్నట్టుగా ప్రస్తుతం ప్రోమో రన్ అవుతోంది. ఈ ఎపిసోడ్ లో శరత్ కుమార్ కి వ్యక్తిగతమైన .. రాజకీయాలకు సంబంధించిన .. సినిమాలకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

రాధిక డామినేట్ చేస్తుందనే విషయాన్ని శరత్ కుమార్ అంగీకరించారు. ఆమె విషయంలో తాను తగ్గి ఉంటానా లేదా అనే విషయాన్ని గురించి పక్కనే ఉన్న రూమ్ కి వెళ్లి మాట్లాడుకుందామని నవ్వేశారు. హీరోగా వచ్చిన ఇమేజ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికి గ్రీన్ కార్డులా ఉపయోగ పడుతుందంటే తాను నమ్మనని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. జయలలితతో రాజకీయపరమైన వ్యవహారం చెడటానికి గల కారణాన్ని వివరించారు. తాను ఎప్పుడూ కూడా ఆమె కాళ్లపై పడలేదని అన్నారు. డీఎమ్ కే పార్టీని గురించి .. రాజకీయల గురించి ప్రస్తావించినప్పుడు ఆయన దణ్ణం పెట్టేశారు.

ఇక 'నడిగర సంఘం' ఎన్నికలు .. ఆ సమయంలో తనపై వచ్చిన ఆరోపణలకు ఆయన సమాధానాలు చెప్పారు. తన కూతురు బోయ్ ఫ్రెండ్ విశాల్ తనపై చేసిన తీవ్రమైన ఆరోపణలను గురించి ప్రస్తావించినప్పుడు కూడా ఆయన కూల్ గానే ఆన్సర్ చేశారు. ఫస్టు వైఫ్ నుంచి ఎందుకు విడిపోవలసి వచ్చింది? వంటి ప్రశ్నలను కూడా ఆయన ఎదుర్కొన్నారు. మొత్తానికి శరత్ కుమార్ ఈ ఎపిసోడ్లో అన్ని వైపుల నుంచి పదునైన ప్రశ్నలను ఎదుర్కొన్నారు. ఆ ప్రశ్నలకు పూర్తిస్థాయిలో ఆయన ఇచ్చిన సమాధానాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వాటిని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆదివారం వరకు వేచి ఉండవలసిందే.




Tags:    

Similar News