తమిళ ప్రముఖ నటులు అయిన శరత్ కుమార్ మరియు రాధా రవిలపై చర్యలు తీసుకోవాల్సిందిగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2017లో నడిగర్ సంఘం అధ్యక్షుడిగా శరత్ కుమార్ వ్యవహరించారు. ఆ సమయంలో నడిగర్ సంఘంకు చెందిన వెంకటామంగళంలోని భూమిని ఏకపక్ష నిర్ణయంతో అమ్మేయడం జరిగింది. ఈ విషయమై సంఘం అధ్యక్షుడు మరియు సంఘం కార్యదర్శి రాధారవిపై గతంలో ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. నడిగర్ సంఘంలోని ఇతర సభ్యుల అనుమతి లేకుండా శరత్ కుమార్ మరియు రాధారవిలు అమ్మేశారంటూ వాదనలు వినిపించారు.
తాజాగా మద్రాస్ హైకోర్టు ఈ విషయమై మూడు నెలల్లో తేల్చి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అనుమతి లేకుండా భూమిని అమ్మినట్లయితే శరత్ కుమార్ మరియు రాధారవిలను అరెస్ట్ చేయాలంటూ పోలీసులను కోర్టు ఆదేశించింది. నడిగర్ సంఘంలో గతంలో పలు గోల్ మాల్ వ్యవహారాలు జరిగాయని గతంలో విశాల్ కూడా ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. నడిగర్ సంఘంకు అధ్యక్షుడిగా విశాల్ ఎంపిక అయిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటానంటూ చెప్పాడు. కాని విశాల్ చూసి చూడనట్లుగా వ్యవహరించాడనే విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు కేసు విషయంలో కోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేయడంతో తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.