తెలుగులో ప్రస్తుతం అత్యధిక క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకడు. పవన్ సినిమా వస్తోందంటే దానికి ఉండే హైప్.. క్రేజే వేరు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విషయంలోనూ ఆ హైపే కనిపించింది. టాక్ ఎలా ఉన్నప్పటికీ తొలి రోజు భీభత్సమైన కలెక్షన్లతో రికార్డుల మోత మోగించింది ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఐతే రెండో రోజు నుంచి ‘సర్దార్’ పరిస్థితి ఏమంత బాగా లేదు. తొలి రోజు టాక్ ఏకపక్షంగా లేదు. పాజిటివ్.. నెగెటివ్ టాక్ సమానంగా ఉంది కానీ.. రెండో రోజుకు వచ్చేసరికి నెగెటివ్ టాక్ ఎక్కువవడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. ‘సర్దార్’ మీద ఉన్న హైప్ ప్రకారం చూస్తే.. టాక్ ఎలా ఉన్నా ఫస్ట్ వీకెండ్ అంతా హౌస్ ఫుల్స్ గ్యారెంటీ అనే అనుకున్నారంతా.
ఐతే శనివారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లాంటి ప్రధాన సెంటర్లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కొన్ని షోలకు ఫుల్స్ పడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మెయిన్ థియేటర్ దేవి 70 ఎంఎంలో తొలి మూడు షోలు హౌస్ ఫుల్ కాగా.. సెకండ్ షో ఫుల్ కాలేదు. సంధ్య 70ఎంఎంలో మార్నింగ్ షో మాత్రమే ఫుల్ అయింది. సంధ్య 35 ఎంఎంలో కూడా అంతే. అప్పటికీ తొలి రోజుతో పోలిస్తే ఒక థియేటర్ తగ్గించారు ఈ సెంటర్లో. మామూలుగా శనివారం ఫస్ట్ షో - సెకండ్ షోలకు కలెక్షన్లు బాగుంటాయి. జనాలు బాగా థియేటర్లకు వస్తారు. కానీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు ఆ రెండు షోలు ఫుల్ కాకపోవడం ఆశ్చర్యం కలిగించేదే. యుఎస్ లో సైతం ‘సర్దార్’ పరిస్థితి ఇలాగే ఉంది. ప్రిమియర్ షోలకు అద్భుతమైన స్పందన వచ్చింది కానీ.. తొలి.. రెండో రోజు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు. వీకెండ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందా అని బయ్యర్లలో గుబులు పట్టుకుంది.