కొంచెం ఉంటే.. బాహుబలిని కొట్టేదే

Update: 2016-04-09 09:07 GMT
సర్దార్ గబ్బర్ సింగ్ టాక్ సంగతి ఎలా ఉన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ దగ్గర ప్రూవ్ అయింది. ప్రీమియర్ షోలతో రిలీజ్ డేట్ కు ముందే రికార్డులతో మొదలుపెట్టి.. ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా మైండ్ బ్లోయింగ్ అనేలా ఉన్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్క 21 కోట్లకు పైగానే తేలింది. ఇది కేవలం ఏపీ - తెలంగాణల్లో మాత్రమే వచ్చిన మొత్తం అనే విషయం గుర్తుంచుకోవాలి.

ఇప్పటివరకూ సెకండ్ బెస్ట్ అయిన శ్రీమంతుడు 14.72 కోట్ల వసూళ్లతో ఇప్పుడు మూడో స్థానంలోకి వెళ్లిపోయాడు. అయితే.. మొదటి స్థానంలో ఉన్న బాహుబలికి వచ్చిన తొలిరోజు వసూళ్లు 22.4 కోట్ల రూపాయలు. సర్దార్ కి వచ్చిన మొత్తం షుమారు 21 కోట్లు. సర్దార్ గబ్బర్ సింగ్ కి పవన్ కళ్యాణ్ కనీస మాత్రం కూడా ప్రచారం చేయలేదన్న మాట గుర్తుంచుకోవాలి. అసలు పవన్‌ కళ్యాణ్‌ తెలుగు మీడియాకు ఇంటర్యూలే ఇవ్వలేదు. కాజల్‌ కూడా అంతే.

సింగిల్ సింగిల్ డైలాగ్స్ తో నాలుగు ప్రోమోలు కట్ చేయడం, టీవీల్లో ప్రదర్శించడం మినహాయిస్తే.. హీరో - హీరోయిన్ - డైరెక్టర్ ఇలా ఎవరూ... డైరెక్టుగా టీవీల్లో కనిపించి ఇంటర్వ్యూలు ఇవ్వడం - ప్రమోషన్స్ చేసుకోవడం చేయలేదు. హిందీ మీడియాకి  ఇంటర్వ్యూలు అయినా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఇక్కడ అది కూడా చేయలేదు. జస్ట్ రిలీజ్ డేట్ ఇచ్చి ఊరుకున్నాడంతే. ఏ మాత్రం ప్రచారం లేకుండానే 21 కోట్ల వసూళ్లు వస్తే.. ఇంకొంచెం  ప్రచారం చేస్తే బాహుబలిని కూడా దాటేయడం పవన్ స్టామినాకి చాలా ఈజీ అనే విషయం ఇప్పుడు అర్ధమైపోతోంది. ఇంతటి భారీ కలక్షన్లు రావడానికి.. సర్దార్ కోసం అఫిషియల్‌ గా చాలా చోట్ల రోజుకు 5 షోలు ప్రదర్శితం చేశారు.. మరీ అదీ కారణం అనుకోవచ్చేమో.
Tags:    

Similar News