పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ కు బుకింగ్స్ ఓపెన్ చేసి నాలుగు రోజులు అయింది. సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చినప్పటి నుంచే ఆన్ లైన్ లో టికెట్స్ అమ్మేస్తున్నారు. అయితే.. ఈ లిస్ట్ లో మల్టీప్లెక్సులు లేవు. దీనికి కారణం నైజాం డిస్ట్రిబ్యూటర్ ఇంద్ర ఫిలింస్ కు - మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు పేమెంట్ విషయంలో వచ్చిన డిఫరెన్సులే.
ప్రీమియర్ షోలు పడేందుకు గంటల సమయమే ఉన్నా.. ఈ వివాదం తేలకపోవడంతో.. ఇక మల్టీప్లెక్సుల్లో సర్దార్ రిలీజ్ ఉండదనే అనుకున్నారు అభిమానులు. పరిస్థితులు కూడా అలాగే కనిపించాయి. అయితే, ఇప్పుడీ వివాదం సమసిపోయింది. డిస్ట్రిబ్యూటింగ్ సంస్థ - మల్టీప్లెక్సులు ఓ ఒప్పందానికి వచ్చేశాయి. దీంతో మల్టీప్లెక్సుల్లో బుకింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇలా వీటి టికెట్లను ఆన్ లైన్ లో ఉంచగానే అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే అన్ని మల్టీప్లెక్సుల్లోనూ ఫస్ట్ డే షోస్ ఫుల్ అయిపోగా.. ఇప్పుడు వీకెండ్ వరకూ ఫుల్ అని, ఫాస్ట్ ఫిల్లింగ్ అని చూపిస్తున్నారు.
ఇప్పటివరకూ మల్టీప్లెక్సుల లెక్క తేలకపోవంతో ఓపెనింగ్స్ విషయంలో సర్దార్ గబ్బర్ సింగ్ వెనకబడతాడనే అనుమానాలు ఇప్పుడు తొలగిపోయాయి. మొత్తం మీద తెలుగు వెర్షన్ వరకూ సర్దార్ గబ్బర్ సింగ్ ఓపెనింగ్ డే విషయంలో పాత రికార్డులన్నీ తుడిచిపెట్టేస్తాడనే అంచనాలు ఉన్నాయి.