పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏ రేంజ్ లో ఉంటుందో.. సర్దార్ గబ్బర్ సింగ్ ప్రూవ్ చేసింది. ఎక్కువగా బెనిఫిట్ షోలు వేయడం - అర్ధరాత్రి నుంచే ప్రదర్శించడం కారణంగా.. రిలీజ్ రోజు తెల్లవారు ఝాముకే సర్దార్ గబ్బర్ సింగ్ టాక్ బయటకు వచ్చేసింది. విపరీతంగా డివైడ్ టాక్ స్ప్రెడ్ అయింది. మాణింగ్ షో కూడా పడకముందే ఇలాంటి టాక్ వచ్చాక.. వేరే ఏ హీరోకి అయినా పరిస్థితి చాలా బ్యాడ్ గా ఉంటుంది. కానీ ఇక్కడున్నది పవర్ స్టార్. అందుకే ఓ రేర్ ఫీట్ సాధ్యమైంది.
సర్దార్ గబ్బర్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున వసూలు చేసిన మొత్తం ''గ్రాస్'' 40.8 కోట్ల రూపాయలు. బాహుబలికి తెలుగు - తమిళ్ - హిందీ వెర్షన్లతో వచ్చిన మొత్తం 73 కోట్లు. 40.8 కోట్ల తొలిరోజు వసూళ్లతో పవన్ కళ్యాణ్ సౌత్ లోనే సెకండ్ ప్లేస్ ఆక్రమించేశాడు. ఆ తర్వాత మూడో స్థానంలో ఉంది రజినీకాంత్ మూవీ లింగా. 39 కోట్ల గ్రాస్.. నాలుగో ప్లేస్ శంకర్ ఐ చిత్రం 36 కోట్లతో నిలిచింది. 33 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి మహేష్ శ్రీమంతుడు ఐదో స్థానంలో ఉంది.
బ్యాడ్ టాక్ వచ్చిన సినిమాతో సౌతిండియాలో సెకండ్ బెస్ట్ గా నిలవడం అంటే చిన్న విషయం కాదు. అదీ పవర్ స్టార్ స్టామినా. ఒకవేళ మంచి టాక్ వస్తే బాహుబలిని దాటేయడం జరక్కపోయినా.. లాంగ్ రన్ లో మాత్రం ఇండస్ట్రీ బెస్ట్ లిస్ట్ లో ఖచ్చితంగా చోటు దక్కించుకునేది. ఇక్కడ ఇచ్చిన అంకెలన్నీ గ్రాస్ లెక్కల్లోనివి. తొలి రోజు వసూళ్లలో దాదాపు డిస్ట్రిబ్యూటర్ వాటా దాదాపు 75 శాతం ఉంటుంది.