పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ రికార్డుల మోత మొదలైపోయింది. ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్ రావడానికి ఇంకా కొన్ని గంటల టైం పడుతుంది కానీ.. యూఎస్ఏలో ప్రీమియర్లలో మాత్రం సర్దార్ పవర్ చూపించాడు. 6.16లక్షల డాలర్ల కలెక్షన్లతో రికార్డుల మోత మోగించేశాడు సర్దార్ గబ్బర్ సింగ్.
ఇప్పటికీ ప్రీమిమర్ల విషయంలో బాహుబలిదే టాప్ ప్లేస్. తొలిస్థానంలో ఉన్న బాహుబలికి ప్రీమియర్లతోనే 1.4 మిలియన్ డాలర్లు వసూళ్లు దక్కాయి. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ కి ప్రీమియర్స్ తోనే 6.16 లక్షల డాలర్లు దక్కాయి. మన లెక్కలో అయితే ఇది 4 కోట్ల పైమాటే. ఇప్పటివరకూ బాహుబలి తర్వాత రెండో స్థానంలో మహేష్ మూవీ శ్రీమంతుడు ఉంది. 5.33 లక్షల డాలర్లు వసూళ్లను శ్రీమంతుడు సాధించగా.. ఇప్పుడా చిత్రాన్ని వెనక్కి నెట్టేసి.. రెండో ప్లేస్ కి చేరుకుంది సర్దార్ గబ్బర్ సింగ్.
ఇప్పుడు యూఎస్ఏ ప్రీమియర్స్ లో మొదటి స్థానంలో బాహుబలి(1.4మిలియన్ డాలర్లు) - రెండో స్థానంలో సర్దార్ గబ్బర్ సింగ్ ( 6.16లక్షల డాలర్లు) - మూడోప్లేస్ లో శ్రీమంతుడు (5.33 లక్షల డాలర్లు) - ఆగడు(5.23 లక్షల డాలర్లు) - అత్తారింటికి దారేది (3.45లక్షల డాలర్ల)తో టాప్ 5 స్థానాల్లో నిలిచాయి.