పవర్ స్టారూ.. ఇవిగో నీ టార్గెట్లు

Update: 2016-04-07 11:30 GMT
పవర్ స్టార్ సినిమా వచ్చేస్తోంది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదలకు ఇంకొన్ని గంటలే మిగిలున్నాయి. పవన్ సినిమా వస్తోందంటే ఆటోమేటిగ్గా రికార్డుల మీదికి ఫోకస్ వెళ్తుంది. మరి పవన్ ముందున్న టార్గెట్లు ఏంటో ఓసారి చూద్దాం పదండి.

* యుఎస్ లో ప్రిమియర్ల ద్వారా అత్యధిక మొత్తం కలెక్ట్ చేసిన రికార్డు బాహుబలిదే. ఆ చిత్రం 10.1 లక్షల డాలర్లు వసూలు చేసింది. ఐతే ఆ సినిమాకు 118 స్క్రీన్లలో ప్రిమియర్లు పడగా.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు 300 దాకా ప్రిమియర్లు ప్లాన్ చేశారు. కాబట్టి ఈ రికార్డు బద్దలవడం ఖాయం.

*  బాహుబలి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ.28.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ రికార్డును అందుకోవడం ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు సాధ్యం కాకపోవచ్చు. ఐతే శ్రీమంతుడు పేరిట ఉన్న నాన్ బాహుబలి రికార్డును మాత్రం ‘సర్దార్’ సునాయాసంగా బద్దలు కొట్టే అవకాశముంది. శ్రీమంతుడు తొలి రోజు రూ.19 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

* బాహుబలి కేవలం రెండు రోజుల్లో వంద కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది. సర్దార్ గబ్బర్ సింగ్ దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఐతే శ్రీమంతుడు సినిమా 10 రోజుల్లో వంద కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసింది. దీన్ని పవన్ సినిమా బద్దలు కొట్టడం ఖాయమే కావచ్చు.

* తొలి వీకెండ్లో శ్రీమంతుడు రూ.60 కోట్ల గ్రాస్.. రూ.42.8 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ రికార్డును సర్దార్ గబ్బర్ సింగ్ బద్దలు కొట్టొచ్చు. బాహుబలి తొలి వీకెండ్లో రూ.197 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.

*  అమెరికాలో తొలి వీకెండ్లోనే ‘శ్రీమంతుడు 2 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. ఆ సినిమా 157 స్క్రీన్లలో రిలీజవగా.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ 200కు పైగా స్క్రీన్లలో విడుదలవుతున్న నేపథ్యంలో ఈజీగా ఈ రికార్డును దాటేయొచ్చు. బాహుబలి రికార్డు 4.42 మిలియన్ డాలర్లు.

*  శ్రీమంతుడు ఫుల్ రన్లో రూ.144 కోట్ల దాకా గ్రాస్.. రూ.95 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసింది. పాజిటివ్ టాక్ వస్తే ఈ రికార్డుల్ని ‘సర్దార్’ బద్దలు కొట్టేసే అవకాశముంది.
Tags:    

Similar News